భీమశంకరాలయం మహారాష్ట్రలోని పూనాకు దగ్గరగా భావగిరి గ్రామంలో ఖేడ్‌కు సుమారు 50 కి.మీ దూరంలో సహ్యాది పర్వతాలలో భీమా నది ఒడ్డున కలదు. భీమానది ఇక్కడ నుండి ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది.
మహారాష్ట్రలోని గృష్ణేశ్వర్ మరియు త్రయంబకేశ్వరం అనే జ్యోతిర్లింగాలు కూడా కలవు.
స్థలపురాణం : రావణాసురుని తమ్ముడైన కుంభకర్ణుని కొడుకు భీముడు తన తల్లి కర్కాటితో ఇక్కడ అరణ్యాలలో నివసిస్తుంటాడు. రావణాసురుని మరియు తన తండ్రి కుంభకర్ణుని చంపిన మహావిష్ణువు మీద పగతో బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి అపారమైన శక్తులు పొందుతాడు. వరగర్వంతో ఇంద్రుని జయిస్తాడు. మూడులోకాలను పీడించసాగాడు. మరియు శివభక్తుడైన గృష్ణేశ్వర్ ను పాతాళచెరలో బంధిస్తాడు. దేవతలంతా బ్రహ్మతో కలసి భీముడి ఆగడాలను గురించి శివునితో మొరపెట్టుకుంటారు.
భీముడు శివునికి బదులుగా తనని ప్రార్థించవసినదిగా కమృపేశ్వర్‌ను ఆజ్ఞపించగా అతను తిరస్కరిస్తాడు. అపుడు కోపోద్రేకుడైన భీముడు తన ఖడ్గంతో శివలింగాన్ని ఖండించబోగా శివభగవానుడు ప్రత్యక్షమై భీమునితో యుద్దంచేసి సంహరిస్తాడు. దేవతల కోరిక మేరకు భీమశంకరునిగా వెలుస్తాడు.