Mahakaleswar, Ujjain…మహాకాళేశ్వర్ ఉజ్జయని .... మహాకాళేశ్వరాయం ఉత్తరభారత దేశంలోని జ్యోతిర్లింగాలో ముఖ్యమైనది.
స్థలచరిత్ర : పురాణ ప్రకారం ఉజ్జయనీ రాజైన చంద్రహాసుని శివభక్తికి ఆకర్షితుడైన 5 సంవత్సరాల బాలుడు శ్రీకరుడు ఒక రాయిని తీసుకొని అదే శివలింగంగా భావించి రోజూ పూజించసాగాడు. అక్కడి ప్రజలు అతనిని అనేక రకాలుగా నిరుత్సాహపరచారు. వారి ప్రయత్నాలన్నీ విఫలంకాగా శ్రీకరుని భక్తికి మెచ్చి శివభగవానుడు జ్యోతిర్లింగ రూపంలో అక్కడ వెలిశాడు.
ఇంకొక కథóనం ప్రకారం దుశాన అనే రాక్షసుడు అవంతీ నగరప్రజలను పీడించుచుండగా శివభగవానుడు ఆ రాక్షసుని సంహరించి ప్రజల కోరిక మేరకు అక్కడ జ్యోతిర్లింగంగా వెలిశాడంటారు.
మహాకాళుని ఆలయం విశాలమైన ప్రాంగణంలో చుట్టూ గోడలతో 5 విభాలుగా ఉన్నది. భూగర్భంలో ఉన్న మహాకాళుని గర్భగుడిలోనికి ఇత్తడి దీపాల వెలుగులో వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడి శివలింగం పెద్దదిగాను మరియు వెండితో చేయబడిన సర్పం చుట్టుకొని ఉంటుంది. శివలింగానికి ఒకవైపున గణేశుని ప్రతిమ, ఇంకోప్రక్క కుమారస్వామి మరియు పార్వతీ దేవి ప్రతిమలు చూడవచ్చు.
మహాకాళుని మందిరం (ఉజ్జయని) ఏడు పవిత్రక్షేత్రాలో ఒకటిగా భావిస్తారు. మిగతా ఆరు క్షేత్రాలు అయోధ్య, మథుర, హరిద్వార్, బెనారస్ (కాశీ) కాంచీపురం మరియు ద్వారక.
క్షిప్రా నదీతీరంలో జరిగే కుంభమేళాకు భక్తులు వచ్చి మహాకాళుని ఆశీర్వాదం పొందుతారు. సహ్వాద్రి పర్వతాలలో ఉన్న ఈ ఆలయం చూట్టూ కోటలతో, అరణ్యాలతో కనువిందుచేస్తుంది. ఈ ఆలయ శిఖరాన్ని నానాపాండవీస్‌చే నిర్మించబడినది. మరాఠా యోధుడైన చత్రపతి శివాజీ మహాకాళుని దర్శించుకున్నాడు. శివరాత్రికి ఇక్కడ మహావైభవంగా ఉత్సవం జరుగుతుంది.
ఎలావెళ్ళాలి : మహాకాళేశ్వరాయం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయనిలో క్షిప్రా నదీతీరంలో కలదు.