header

Nageswar Jyothirlingam

Nageswaralayam, Gujarat…నాగేశ్వరాలయం (నాగేశ్వర్‌) - గుజరాత్‌
ఈ పవిత్ర నాగేశ్వరాలయానికి సంవత్సరం పొడుగు భక్తులు వస్తారు. ఈ స్వామిని దర్శించుకుంటే అన్నిరకాల విషప్రయోగాల నుండి విముక్తులవుతారని భక్తుల విశ్వాసం.
స్థలపురాణం : శివపురాణం ప్రకారం ఇక్కడ దారుకా వనంలో దారుకుడనే రాక్షసుడు తన భార్య దారుకితో నివసిస్తాడు. శివభక్తుడైన సుప్రియడు మరియు అనేక మందిని చెరసాలలో బంధిస్తాడు. సుప్రియుని ప్రేరణతో అందురూ ఓంనమఃశ్శివాయ మంత్రాన్ని జపిస్తారు. కోపోద్రేకుడైన దారుకుడు వారిని సంహరించబోగా శివభగవానుడు జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమై పాశాపతాస్త్రంతో దారుకుని సంహరిస్తాడు.
ఎలా వెళ్ళాలి : ఈ పవిత్ర నాగేశ్వరాలయం గుజరాత్‌ రాష్ట్రంలో గోమటి ద్వారక మరియు బేయిట్‌ ద్వారకా దీవి మార్గంలో కలదు. బెట్‌ద్వారకా, జామ్‌నగర్‌, అహ్మదాబాద్‌, రాజ్‌కోట్‌ నుండి రోడ్డుమార్గాలలో వెళ్ళవచ్చు. దగ్గరలోని రైల్వే స్టేషన్‌ లు జామ్‌నగర్‌, రాజ్‌కోట్‌, ద్వారక, పోర్‌బందర్‌ అహ్మదాబాద్