ఓంకారేశ్వరుడు నారదుడు ఒకసారి భూలోక సంచారం చేస్తూ వింధ్య పర్వతాలకు వస్తాడు. వింధ్యపర్వతుడు నారద మహర్షికి గౌరవ మర్యాదలతో అతిధి సత్కారాలు చేస్తాడు. తదుపరి ఇరువురి ప్రసంగంలో వింధ్య పర్వతుడు నా యందు సమస్త సంపదలు సకల ధాతువులు మిక్కిలిగా ఉన్నాయి. కాబట్టి నేనే పర్వతాలన్నిటి సార్వభౌముడని అన్నాడు.
అందులకు నారదుడు వింధ్యా నీ ఎలా పర్వత సార్వభౌముడవు కాగలవు. మేరు పర్వత శిఖరాలు మహోన్నతాలై దేవలోకము వరకు వ్యాపించి ఉన్నాయి. ఇంద్రాది దేవతలు ఆ పర్వతంపై విహరిస్తుంటారు. నీకా భాగ్యం లేదు కదా. అని అన్నాడు. వింధ్యుడు విచారించి మేరు పర్వతం కన్నా తానే గొప్పవాడనిపించుకోవటానికి నిశ్ఛయించుకొన్నాడు.
వింధ్యుడు తన శిఖరమున ఓంకార యంత్రమును నిర్మించి దాని మధ్య పార్థివ లింగమును స్థాపించి శివుని కొరకై ఘోర తపమాచరించాడు. ఇట్లు నూరు మాసములు కఠోర తపస్సు సాగిన తరువాత శివుడు అనుగ్రహించి దర్శనమిచ్చి వరం కోరుకొమ్మన్నాడు.
వింధ్యుడు వినయంతో నమస్కరించి శంకరా...మేరు పర్వతములపై విహరించు ఇంద్రాదులకు నీ పవిత్ర పాద పద్మమలు నిత్య పూజనీయములు అట్టి నీవు నా శిఖము నందు నివసించి పూజలందుకొనుమని ప్రార్థించాడు.
వింధ్యాద్రి ప్రార్థనను మన్నించి కైలాసనాథుడు ఓంకార యంత్రమును మరియు అందులో స్థాపించిన పార్థివ లింగమును ఒకటిగా చేసి ఓంకారేశ్వరుడు అను పేర జ్యోతిర్లింగ రూపుడై వెలిసాడు. ఆనాటి నుండి కైలాసనాథుని బ్రహ్మాది దేవతలు సేవిస్తున్నందు వలన వింధ్యుడు ఆనందిస్తాడు.
ఎలా వెళ్ళాలి ? దగ్గరలోని విమానాశ్రయం ఇండోర్. సమీప రైల్వే స్టేషన్ ఓంకారేశ్వర్ రోడ్. (ఖాండ్వా మీటర్ గేజ్ రైలు మార్గములో ఉన్నది.) ఓంకారేశ్వర్ రోడ్ నుండి 9 కి.మీ. దూరంలో ఓంకారేశ్వరం వున్నది. ఓంకారేశ్వర్ రోడ్ నుండి ఆటోలలో,