header

Jambukeswaram Temple....జంబుకేశ్వరం

Jambukeswaram Temple....జంబుకేశ్వరం

జంబుకేశ్వరం జంబుకేశ్వరం పంచభూత క్షేత్రాలలో రెండవది. తమళనాడులోని తిరుచ్చికి 11 కి.మీ. దూరంలో ఉన్నది. ఏనుగుల చేత పూజలందుకున్న క్షేత్రమని కూడా అంటారు. పూర్వం ఇక్కడ జంబు వృక్షాలు(నేరేడు చెట్లు) ఉండటం చేత జంబుకేశ్వరం అని పేరు వచ్చిందంటారు
ఇతిహాసం
మొదటి కథ ప్రకారం ఇక్కడ శంభుడు అనే ఋషి ఇక్కడ నివసిస్తుండేవాడు. ఆ ఋషి అత్యంత శివభక్తుడు శివుని పూజించందే మంచినీరు కూడా స్వీకరించేవాడు కాదు. కాలం గడుస్తుంగా ఒకసారి శంభుడికి శివుని ప్రత్యక్షంగా పూజించాలని కోరిక కలిగింది. ఆ విధంగా శివుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేయనారంభించాడు. శివుడు అతని తపస్సుకి మెచ్చి ప్రత్యక్షం అయి వరం కోరుకోమనగా శంభుడు తన కోరిక అయినా ప్రత్యక్షంగా పూజించే వరం కోరుకొనాడు. భోళా శంకరుడు అంగీకరించి ఇక్కడ లింగ రూపములొ వెలుస్తాను, నువ్వు జంబు వృక్ష రూపం ఉండి నన్ను పూజించెదవు అని చెప్పి అంతనార్థం అవుతాడు. శివుడు శంభుడికి ఇచ్చిన వరం ప్రకారం లింగంగా ఆవిర్భించగా శంభుడు జంబు వృక్షమై శివుని అర్చిస్తుంటాడు. ఆలయ ప్రాంగణంలొ ఉన్న జంబువృక్షమే శంభుడిగా ఇక్కడి భక్తుల నమ్మకం.
మరో ఇతిహాసం ప్రకారం
ఇక్కడ స్వామి వారిని ఏనుగు, సాలిపురుగు పోటి పడి పూజిస్తుండేవి. ఆ శ్రీకాళహస్తి స్థలపురాణానికి సన్నిహితంగా ఉండే ఇతిహాసం ఇక్కడ కూడా వినిపిస్తుంది.
జంబుకేశ్వరం పవిత్ర కావేరి నది ఒడ్డున ఉన్నది. స్థానికులు ఈ నదిని పొన్ని అని పిలుస్తారు. తమిళంలొ పొన్ని అంటే బంగారం అని అర్థం. ఇక్కడ కావేరి నది లొ స్నానం ఆచరించడం జంబుకేశ్వరుడిగా వెలసిన శివుడిని కొలవడం చాలా శ్రేష్ఠం అని ఇక్కడ స్థానికుల నమ్మకం. ఇక్కడి దేవాలయం విశాలమైన ప్రాకారలతో ఎత్తైన గోపురాలతో ఉన్నది. దేవాలయం ఐదు ఎకరాల విస్తీర్ణం, ఐదు ప్రాకారాలు కలిగి ఉన్నది. ఆలయానికి మొత్తం ఏడు గోపురాలు ఉన్నాయి. జంబుకేశ్వర స్వామి వారు పశ్చిమాభిముఖంగా ఉన్నారు. గర్భగుడి ప్రక్కన అఖిలాండేశ్వరి ఆలయం కూడా ఉన్నది. ఆలయప్రాకారములొ జంబుకేశ్వర స్వామి ఆలయం, అఖిలాండేశ్వరి ఆలయమే కాకుండా అనేక ఉపలయాలు, అనేక మండపాలు ఉన్నాయి
జంబుకేశ్వరం దాదాపు 1800 సంవత్సరాల క్రితం నాటిది. ఈ ఆలయం లోపల 5 ఆవరణలు ఉన్నాయి. నాలుగో ఆవరణలో 796 స్థంభాలు, విశాలమైన హాలు ఉన్నాయి. ఐదవల ఆవరణను విభూది ప్రాకారం అంటారు ఇది కేవలం రెండు అడుగుల వెడల్పుతో 25 అడుగుల ఎత్తు ఉండి షుమారు మైలు దూరం వరకు ఉంటుంది. గర్భగుడి పశ్చమ ముఖం అంతర్భాగమైన రాతి కిటికీలో నుండి స్వామిని దర్శంచుకోవాలి. పార్వతీదేవి కావేరీ నదీ జలాలలతో లింగాన్ని చేసి తపస్సు చేయగా, శివుడు ప్రత్యక్షమై జ్ఞానాన్ని బోధించాడంటారు. అందుకే ఈ ఆలయాన్ని జ్ఞాన నేత్రం అంటారు.
గర్భ గుడి
జంబుకేశ్వరుడిగా పేరుపొందినప్పటికీ ఇక్కడి లింగం నీటితొ నిర్మితమై వుంది కాని నీటిలొ లేదు. లింగం పానపట్టం నుండి ఎల్లకాలము నీరు ఊరుతూ ఉంటుంది. ఈ విషయం భక్తులకు చూపించేందుకు లింగం పానపట్టం పై ఒక వస్త్రం కప్పుతారు. కొంతసేపటికి దానిని తీసివేసి ఆ వస్త్రాన్ని పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుండి నీరు వస్తుంది. గర్భగుడిలొ గవాక్షానికి "నవద్వార గవాక్షం" అని పేరు. గర్భాలయం లో ఉన్న జంబుకేశ్వరుడినే అప్పులింగేశ్వరుడు, నీర్ తిరళ్‌నాథర్ అని కూడా పిలుస్తారు.
అఖిలాండేశ్వరి ఆలయం
జంబుకేశ్వరస్వామి దేవేరి అఖిలాండేశ్వరి అమ్మవారు.అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారు, నాలుగు భుజాలలొ పై రెండు చేతులతో కలువలు పట్టుకొన్నట్లు, క్రింది చేతులు అభయ హస్తంతో వరద ముద్ర తో ఉన్నారు. అఖిలాండేశ్వరి అమ్మవారు పూర్వం చాలా ఉగ్రంగా ఉండేవారని శంకరాచార్యులు ఈమె ఉగ్రాన్ని తగ్గించడానికి తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని శాంతమూర్తిగ మార్చారని చెబుతారు. అమ్మవారి ముందు కనిపించే శ్రీచక్రాన్ని ప్రతిస్టించారని , అమ్మవారి కర్ణభూషణాలను కూడా శంకరాచార్యులవారే సమర్పించారని చెబుతారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా వినాయకుడు కొలువుదిరి ఉన్నాడు. ఇక్కడ వినాయకుడిని కూడా ఆదిశంకరులే ప్రతిష్ఠించారని ఇక్కడి వారి నమ్మకం
Jambukeswaram Temple This temple is situated in Coromandel between two rivers, Cauvery in south, coleroon in North. It is one of the five element shrines or Pancha Bootha sthalams and is renowned for the worship of lord Siva as representing the element of water (appulinga)
As an Elephant was blessed here after worshipping here, this temple came to be known as ‘Thiruvanaikka’. As Lord Siva is seated below Jambu tree at this temple, it got its name Jambukeswaram. When Goddess Ahilandeswari penanced here, Lord Siva satisfied by her prayer blessed her. For this reason this temple is also known as Gnanashethram.
A spider, which worshipped Lord Jambukeswarar in its previous life, was blessed to born as Kochengat cholan in its next birth. He constructed this temple about 2500 years ago. Uma Deviyar, Thirumal, Brahman, Attathikku Balakhar, Attavasukkal, Jambu Munivar, Gowthamar, Aghasthiyar, a spider known as Gananatharul maliyavan, an elephant named Pushbadhanthan, Suryan and Chandran attained glory by worshipping at this temple.
Thirugnana Sambanthar, Appar, Sundarar, Arunagirinathar, Iyyadigal kadawarkon, Thayumanavar have enchanted the glory of Lord Jambukeswarar in theirliterary works. Goddess blessed poet Kalamega Pulavar with the talent to write poems at this temple.
This temple is endowed with 5 praharams.(corridor) As lord Siva himself built the 5th praharam, appearing in the form of Spider, it is known as ‘Thiruneettan thirumathil’. It is here lord Siva blessed a spider and elephant to attain moksha.
Monolithic stone pillars (made from single stone) are found in the mandapam, situated at the entrance of Aariyavittan tower in 3rd Praharam. Stone chains and 12 zodiac signs are beautifully carved on these pillars. Pillars found in 1000 pillar hall and in various parts of temple have artistic sculptural works. Temple cars In the year1910, 2 big temple cars were made for god & goddess. ‘Coratham’(used for procession) and several wooden Vahanas are present in this temple. Inscriptions 156 Inscriptions have been found at this temple. Inscriptions of King Madurai konda Parakesari varman paranthaka cholan is the oldest among them. Informations about renovations and wealth of this temple are found in these inscriptions Official Website of Jambukeswaram :http://www.thiruvanaikavaltemple.tnhrce.in