header

Konark Temple..కోణార్క దేవాలయం ..Sun God Temple

Konark Temple..కోణార్క దేవాలయం

ఒడిషా (ఒరిస్సా)లోని కోణార్క దేవాలయం భారతదేశంలో ప్రముఖ సందర్శనా స్ధలాలలో ఒకటి. ఈ దేవాలయం పూరీ జగ్నన్నాధాలయం నుండి 35 కి.మీ. దూరంలో ఉంది. క్రీ.శ. 13వ శతాబ్ధంలో (1236-64) గంగవంశపు రాజైన నరసింహునిచే నిర్మించబడినది. యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించబడినది.
ఆలయ విశేషాలు : సూర్యుని రథం ఆకారంలో నిర్మించబడిన ఈ ఆలయం అద్భుత శిల్పకళా నిలయం. 12 జలత అలంకృత చక్రాలతో, ఏడు గుర్రాలతో లాగబడుచున్న పెద్ద రథం ఆకారంలో కట్టబడినది. ఆలయ నిర్మాణానికి నల్లగ్రనైట్‌ రాతిని ఉపయోగించారు. సంవత్సరానికి 12 మాసాలు 12 రాశులు వీటికి అనుగుణంగా మరియు సూర్యగమనానికి అనుగుణంగా ఈ ఆలయం నిర్మించబడినది.
కోణార్క దేవాలయం చూసిన తరువాత ఇక్కడకు 3 కి.మీ. దూరంలో ఉన్న కోణార్క్‌ బీచ్‌ను సందర్శించవచ్చు. బీచ్‌ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఇంకా ప్రపంచ ప్రసిద్ధి పొందిన పూరీ జగ్నన్నాధాలయం కూడా ఇక్కడకు సుమారు 35 కి.మీ. దూరంలో ఉంటుంది.
వసతి సౌకర్యాలు : కోణార్క్‌లో బస చేయగోరినవారు ఇక్కడ వున్న యాత్రినివాస్‌, పంత్‌నివాస్‌లో లేక కోణార్కలో ఉన్న హోటల్స్‌లో బసచేయవచ్చు.
ప్రయాణ సౌకర్యాలు : కోణార్క్‌కు దగ్గరలో ఉన్న విమానాశ్రయం భువనేశ్వర్‌ ఇక్కడ నుండి కోణార్క్‌ 64 కి.మీ. దూరంలో ఉంటుంది. పూరి నుండి 35 కి.మీ దూరంలో ఉన్న కోణార్క్‌కు రైలు ద్వారా కూడా వెళ్ళవచ్చు. పూరీ మరియు భువనేశ్వర్‌ నుండి కోణార్క్‌కు బస్‌లో కూడా వెళ్ళవచ్చు.