header

Pandaripuram Temple, Maharashtra, Panduranga Swamay

Pandaripuram Temple, Maharashtra, Panduranga Swamay

ప్రసిద్ధి చెందిన ఈ వైష్ణవ పుణ్యక్షేత్రం మహారాష్ట్రలో షోలాపూర్‌లో భీమా నది ఒడ్డున ఉన్నది. ఈ దేవాలయానికి ఆరు ద్వారాలు ఉన్నాయి.తూర్పున ఉన్న ఆరవ ద్వారాన్ని నామ్‌దేవ్‌ ద్వారంగా పిలుస్తారు.
ఇక్కడ శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవి సమేతం పాండురంగ విఠలుడుగా వెలసి ఉన్నాడు. మహారాష్ట్ర వారు ఈ పుణ్యక్షేత్రాన్ని దక్షిణకాశిగా పిలుస్తారు.
స్వామిని విఠోబా, పండరీనాథ్‌, పాండురంగ, విఠల్‌నాధ్‌ అని కూడా పిలుస్తారు. కుల, మత భేధం లేకుండా ప్రతివారు ఆలయ ప్రవేశం తరువాత స్వామివారి పాదాలను కూడా తాకవచ్చు.
పాండురంగస్వామి భక్తులు : తుకారం, ధ్యానేశ్వర్‌, నామ్‌దేవ్‌, పురంధరదాస్‌, విజయదాస్‌, గోపాదాస్‌ జగన్నాధదాస్‌ వీరంతా ప్రసిద్ధిచెందిన పాండురంగస్వామి భక్తులు. వీరంతా13 నుండి 17వ శతాబ్ధాల మధ్య కాలానికి చెందినవారు.
ఉత్సవాలు : ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశికి జరిగే ఉత్సవం ప్రసిద్ధి చెందినది. ఈ ఉత్సవానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. భీమా నదీ ప్రాంతమంతా కోలాహంగా ఉంటుంది. కార్తీక మాసం(కార్తీక ఏకాదశి), మాఘమాసం, శ్రావణమాసాలలో కూడా స్వామివారికి ప్రత్యేకంగా ఉత్సవాలు జరుగుతాయి.
దర్శన వేళలు : దేవాలయాన్ని ఉదయం 04-00 గంటకు తెరుస్తారు. ఉదయం గం॥04-30 నుండి రాత్రి గం॥11-00 వరకు దర్శనం చేసుకోవచ్చు.
వసతి సౌకర్యాలు : పండరీపురంలో పాండురంగ భక్తనివాస్‌ (భక్తనివాస్‌ ఫోన్‌ నెం : 23312 / 24466) మరియు అనేక మఠాల వారి థర్మశాలలు, మఠాలు తక్కువ ధరలో ఉన్నవి. ఇవికాక ప్రైవేట్‌వారి లాడ్జీలో ఉండవచ్చు. జులై నుండి ఫిబ్రవరి వరకు పర్వటనకు అనుకూలం. ఎండాకాలంలో చాలా వేడిగా ఉంటుంది. 42 డిగ్రీల సెల్సియస్‌ దాకా వేడి ఉంటుంది
ఎలా వెళ్ళాలి :
దగ్గరలో ఉన్న విమానాశ్రయము : పూనా (204 కి.మీ.)
రైల్వే స్టేషన్‌ : షోలాపూర్‌ (పండరీపురానికి 74 కి.మీ. దూరం) లేక కురువాడి - మీరజ్‌ దారిలో ఉన్న పండరీపురంలో దిగవచ్చు.
Trains…From Secunderabad Jn to Solapur
11020-Konark Express 11:45 AM..... 06:45 PM..... 7h All Days
12026-Pune Shatabdi 02:55 PM........ 07:37 PM......... 4h 42mjourney time...... Except Tue-All days
17204- Cct Bvc Express 03:00 PM........ 09:15 PM........ 6h 15mjourney time..... Thu
17018)- Rajkot Express 03:00 PM........ 09:15 PM........ 6h 15mjourney time...... Mon, Tue & Sat
From Hyderabad Decan
12702- Hussainsagar Ex 02:45 PM......... 08:50 PM..... 6h 5m....... journey time...... All Days