ఒరిస్సా రాష్ట్రంలో, పూరీ పట్టణంలో బంగాళాఖాతం సముద్రతీరాన ఉన్న ప్రముఖ వైష్ణవాలయం పూరీజగన్నాథ దేవాలయం. ఇది విష్ణుభక్తులకు, కృష్ణభక్తులకు ఎంతో ప్రియమైనది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు తన చెల్లెలు సుభద్ర మరియు అన్న బలరామునితో కలసి దర్శనమిస్తారు.
అత్యంత ప్రాచీనమైన ఆలయం పూరీ జగన్నాధాలయం. ఇప్పుడు ఉన్న దేవాలయం గంగ వంశానికి చెందిన కళింగ రాజు అనంతవర్మ చోడగంగ (క్రీ.శ 1048-1148) ప్రారంభించాడు. ప్రస్తుతం కనబడుతున్న నిర్మాణాలు మాత్రం క్రీ.శ. 1174 సంవత్సరంలో అనంగ భీమదేవుడిచే నిర్మించబడ్డాయి. ఆలయం 14 సంవత్సరాల పాటు నిర్మించబడి క్రీ.శ.1198 సం॥లో ప్రాణప్రతిష్ట జరిగింది.
ఆలయం గురించి విభిన్న కధనాలు ప్రచారంలో ఉన్నాయి.
అందులో ఒకటి : ఇంద్రద్యుమ్న మహారాజు గొప్ప దైవభక్తుడు. నీలాచలం అనే పర్వతం మీద జగన్నాధస్వామి సుభధ్రా, బలదేవునితో పాటు వెలసిఉన్నాడని తెలుసుకొని స్వామి దర్శనం కోసం అక్కడకు వెళతాడు. కాని స్వామి ఇంద్రద్యుమ్న మహారాజును పరీక్షించ కోరి అక్కడనుండి అదృశ్యమవుతాడు. రాజు అక్కడ నుండి నిరాశతో తిరిగి వెళతాడు. ఒకరోజు స్వామి ఇంద్రద్యుమ్న మహారాజుకు కలలో కనపడి సముద్రపు అలలలో రెండు కొయ్యదుంగలు కొట్టుకు వస్తాయని వాటినుంచి తమ విగ్రహాలు చెక్కించమని ఆదేశిస్తాడు. రాజు ఆ దుంగలను తన రాజ్యానికి తీసుకువస్తాడు. సాక్షాత్తు విశ్వకర్మ శిల్పిరూపంలో వచ్చి తాను ఆ దుంగలను విగ్రహాలుగా చెక్కుతానని చెప్పి ఒక షరతు పెడతాడు. దాని ప్రకారం దుంగను, తనను ఒకగదిలో పెట్టి తలుపు బంధించమని చెపుతాడు. తనంతటతాను బయటకు వచ్చేదాకా తలుపు తెరవకూడదని చెబుతాడు.
10 రోజుల తరువాత రాజమాత లోపల ఉన్న శిల్పి 10 రోజులుగా ఆహారం లేకుండా ఉన్నాడని తలుపు తెరిపిస్తుంది. శిల్పి అదృశ్యమవుతాడు. విగ్రహాలు అసంపూర్తిగా చెక్కబడి ఉంటాయి. వాటిని అలాగే ప్రతిష్టించాలని రాజుకు అదృశ్యవాణి ఆజ్ఞాపించటంతో విగ్రహాలను అలాగే ప్రతిష్టిస్తారు.
ఇంకొక కధనం ప్రకారం నీలమాధవుడనే పేరుతో స్వామి దట్టమైన అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో గిరిజనుల దైవంగా పూజలందుకునేవాడట. గిరిజన రాజు విశ్వావసుడు మూడో కంటికి తెలియకుండా వెళ్ళి పూజు చేసేవాడట. ఈ సంగతి తెలుసుకున్న ఇంద్రద్యుమ్నుడు రహస్నాన్ని తెలుసుకోవటానికి విద్యావతి అనే యువకుడిని నియమిస్తాడు.br/>
విద్యావతి విశ్వావసుడి కూతుర్ని ప్రేమించి పెళ్ళాడతాడు. ఒకసారి మామ వెంట గుడికి వెళతానని పట్టుబడతాడు. విశ్వావసుడు అల్లుడి కళ్ళకు గంతలు కట్టి తనతో తీసుకు వెళ్తాడు. విద్యావతి తెలివిగా ఆ మార్గంలో ఆవాలు చల్లుకుంటూ వెళ్తాడు. కొన్నాళ్ళ తరువాత ఆవాలు మొలచి దారి చూపిస్తాయి. ఈ సంగతి తెలుసుకున్న ఇంద్రుమ్మ మహారాజు గుడికి వెళ్ళేసరికి విగ్రహాలు మాయమవుతాయి. ఓరోజు రాజుకు జగన్నాధుడు కలలో కనిపించి సముద్రంలోనుంచి వేపదుంగ కొట్టుకు వస్తుంది. దానితో విగ్రహాలు చేయించమని చెబుతాడు.తరువాత పై కధలోనిదే.
ఆలయ విశేషాలు : ఈ ఆలయం వేయి ఎకరాల సువిశాల ఆవరణలో ఉండి చుట్టూ ప్రాకారంతో ఉంటుంది.శంఖాకృతి ఉండటంతో శంఖక్షేత్రమని పేరు వచ్చింది. లోపల సుమారు 120 దాకా ఆలయాలు ఉన్నాయి. ఒరిస్సా సాంప్రదాయ రీతిలో కట్టబడిన ఈ ఆలయం భారతదేశంలో పేరుపొందిన ఆలయాలలో ఒకటి. ఆలయానికి నాలుగు సింహద్వారాలున్నాయి. సింహద్వారాలకు ఇరువైపులా భారీ సింహాల విగ్రహాలున్నాయి. సింహద్వారం నుండి లోనికి ఒక అడుగు వేయగానే సముద్ర ఘోష వినపడదు. ఒక అడుగు వెనుకకు వేస్తే సముద్ర ఘోష వినపడుతుంది.
1. ఆలయం జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేక దశలో ఉంటుంది.br/>
2. ఆలయంపై ఉండే సుదర్శన చక్రం పూరీలో ఎక్కడ ఉన్నా మనవైపే చూస్తున్నట్లుగా ఉంటుంది. br/>
3. మామూలు సమయాలలో సముద్రం నుండి గాలి భూమిదిశగా వస్తుంది. సంధ్యావేళలో దానికి వ్యతిరేకంగా ఉంటుంది. కానీ పూరీ పట్టణంలో దీనికి విరుద్ధంగా ఉంటుంది.br/>
4. పక్షులు గాని, విమానాలుగాని ఈ ఆలయం మీదుగా వెళ్ళవు.br/>
5. గుమ్మానికి ఉండే కప్పునీడ ఏ సమయంలో ఐనా, ఏ దిశలోనైనా కనపడదు.br/>
6. ఆలయంలో ఉండే ప్రసాదం సంవత్సరమంతా అలానే ఉంటుంది. దాదాపు 20 లక్షలమందికి పెట్టవచ్చు. ప్రసాదం వృధా అవ్వదు, తక్కువ కాదు.br/>
7. జగన్నాథుని వంటశాలలో కట్టెల పొయ్యి మీద వండే ప్రసాదం 7 మట్టి పాత్రలను ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కింద ఉన్న పాత్రలో ఉండే ప్రసాదంతో సమానంగా పైన ఉన్న పాత్రలోని ప్రసాదంకూడా సమానంగా ఉడుకుతుంది.
ఒడిశాలోని పూరి క్షేత్రానికి దేశంలోని అన్ని ప్రాంతాలతో రవాణా సదుపాయం వుంది. దేశంలోని ప్రధాన నగరాల నుంచి పూరీకి రైలు సర్వీసులు నడుస్తున్నాయి
భువనేశ్వర్లోని బిజూపట్నాయక్ విమానాశ్రయం పూరికి 60 కి.మీ. దూరంలో వుంది.
.
కోల్కతా-చెన్నై ప్రధాన రైలుమార్గంలోని ఖుర్ధారోడ్ రైల్వేస్టేషన్ ఇక్కడ నుంచి 44 కి.మీ. దూరంలో వుంది.
భువనేశ్వర్, కోల్కతా, విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యముంది.
......................తరువాత పేజీలో జగన్నాధ స్వామి ప్రసాదం ప్రత్యేకత.......