పవిత్ర గంగానది ఋషికేశ్ గుండా ప్రవహిస్తుంది. గంగా నది హిమాలయాలలోని శివాలిక్ కొండలను దాటి ఉత్తర భారత మైదానాలలో ప్రవేశించే ప్రదేశమే ఋషికేశ్. ఋషికేశ్ లోని గంగాతీరంలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. అలాగే నూతనంగా నిర్మించిన దేవాలయాలు ఉన్నాయి. భారత దేశంలోని వేలకొలది భక్తులే కాక వీదేశీ పర్యాటకులు కూడా ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతుంటారు. ఋషికేశ్‌లో ఉన్న యోగా శిక్షణాలయాలూ భక్తులను ఆకర్షించడానికి ప్రధాన కారణం. యోగా నగరం అని రిషికేశ్ కు మారుపేరు విదేశీయులలో ప్రసిద్ధం. పవిత్ర గంగా స్నానం, ఋషికేశ్‌లో ధ్యానం భక్తులకు మోక్షం కలిగిస్తుందని భక్తుల విశ్వాసం.
ఋషికేశ్ పరిసర ప్రాంతంలో గంగా నదీ తీరంలో ఉన్న ఋషి వాటికలు కారణంగా ఈ ఊరికి ఈ పేరు వచ్చినట్లు విశ్వసిస్తున్నారు. ఇది వ్యాపార మరియు సమాచార కూడలిగా కూడా ప్రాముఖ్యత కలిగిన నగరం. శివానందనగలో స్వామి శివానందచే స్థాపించబడిన ' శివానంద ఆశ్రమం' మరియు 'డివైన్ లైఫ్ ఆఫ్ సొసైటీ' ఉన్నాయి. ఉత్తర ఋషికేశ్, లక్ష్మణ్ ఝులా ఉత్తర భాగంలో కొంచందూరంగా ఉన్న స్వర్గ్ ఆశ్రమం దాని చుట్టూ ఉన్న చిన్న చిన్న ఆశ్రమాలు నీలఖంఠ మహాదేవ్ గుడి గంగానది తూర్పు తీరంలో ఉన్నాయి. నీలఖంఠ మహాదేవ్ గుడి ఋషికేశ్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రివేణీ ఘాట్‌లో ఇచ్చే హారతి దర్శించడానికి భక్తులు ఆసక్తి చూపుతుంటారు.
ఋషికేశ్‌లో 120 సంవత్సరాల క్రితం స్థాపించబడిన కైలాష్ ఆశ్రమ బ్రహ్మవిద్యాపీఠం ఉంది.ఇక్కడ విద్యార్ధులకు ప్రాచీన వేదవిద్యలో శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణాలయంలో ప్రసిద్ధులైన స్వామి వివేకానంద, స్వామి రామతీర్ధ మరియు స్వామి శివానంద శిక్షణ తీసుకున్నారు.
Rishikesh has been a part of the legendary 'Kedarkhand' Legends state that Lord Rama did penance here for killing demon king of lanka Ravana, Rama and his younger brother, crossed the river Ganges, at a point, where the present 'Lakshman Jhula' bridge , This bridge formed by using a jute rope bridge. The 'Kedar Khand' of Skanda Purana, also mentions the existence of Indrakund at this very point. The jute-rope bridge was replaced by iron-rope suspension bridge in 1889, and after it was washed away in the 1924 floods, it was replaced by the present stronger bridge. Another similar suspension bridge Ram Jhula was built in 1986 at nearby Shivananda Nagar.
Sacred river Ganges flows through Rishikesh. Several ancient temples are found here. Shatrughna Mandir, Bharat Mandir, Lakshman Mandir are the ancient temples established by Adi Shankaracharya. Shatrughna Temple is located near Ram Jhula and Lakshman Mandir is near to Lakshman Jhula.