ద్వారావతి భక్తినివాస్ : బస్‌స్టాండ్ నుండి నడచి వెళ్ళవచ్చు ( ధర్మశా తరువాత రెండు నిమిషాలప్రయాణం)
.
334 రూములు. సత్రాలు, 6 నుండి 10 మంది సభ్యులకు సరిపోవు రూములు కలవు. 80 ఎ.సి రూములు కలవు. పార్కింగ్ స్పేస్, 24 గంటలు నీటివసతి, కరెంట్ సౌకర్యం కలదు.
సామాన్య భక్తులకు : కామన్ బాత్ రూమ్స్, టాయ్‌లెట్స్ : రూ.50 మాత్రమే.
ఎ.సి. సూట్స్ : ఒక రోజుకు రూ.700
భక్తినివాస్ (కొత్తది)542 రూములు గల విశామైన కాంప్లెక్స్ సాయి మందిరానికి దక్షిణము వైపున గల హైవేలో
ఉన్నది. షుమారు 1 కిలో మీటరు దూరం. మందిరం కాంప్లెక్స్ నుండి న్యూ భక్తినివాస్‌కు 24 గంటలు ఉచిత బస్సులు కలవు. పార్కింగ్ సౌకర్యం, 24 గంటలు విద్యుత్ మరియు నీటి సౌకర్యం, ఫలహారశాలు కలవు. సోలార్ సిస్టమ్ ద్వారా వేడినీటి సౌకర్యం
ధర్మశాల ప్రాంగణం
మందిరాని దక్షిణ పశ్ఛిమ దిశలో మరియు బస్‌స్టాండ్‌నకు పశ్చిమ దిక్కులో కలదు.15 నుండి 80 మంది గల సభ్యులకు విశాలమైన వసతి సదుపాయం సాధారణ రుసుముతో (ఒక్కొక్కరికి రూ.13. రూపాయలు)పార్కింగ్ స్పేస్, 24 గంటలు నీటి, కరెంట్ వసతి. పహారశాల కలదు
సాయి ప్రసాద్ భక్తి నివాస్ 1 మరియు 2 : ఇక్కడ భక్తుల కోసం165 గదుల మరియు లాకర్ల సౌకర్యం కలదు. (సమాధి) ఆలయ సముదాయానికి ఉత్తరము వైపున కలదు
సాయినివాస్ (వి ఐ పి) వసతి గృహం: పాత ప్రసాదాలయం సముదాయంలో లడ్డూ కౌంటర్ వెనుక భాగంలో కలదు.
సాయి ఆశ్రమం 1 : భక్తుల కొరకు 1536 రూములు కలవు.పలహారశాల సౌకర్యం కలదు.
సాయిబాబా భజనలు, కీర్తనలు మరియు సాంస్కృతిక కార్య క్రమాల కోసం ఓపెన్ ఎయిర్ ధియేటర్. సాయిబాబా సమాధి మందిరం నుండి దక్షిణ దిశలో నగర్-మన్మాడ్ జాతీయ రహదారిలో అహ్మద్‌నగర్‌కు వెళ్ళే దారిలో కలదు.
ఇతర ఉచిత వసతి సౌకర్యాలు
శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవీ ఆర్యవైశ్య ట్రస్ట్ వారి నిత్యాన్న సత్రం
మతపర భేదం లేకుండా అన్ని వర్గాల వారికి 3 రోజుల పాటు భోజన, వసతి సౌకర్యాలు కల్పించ బడును.(కొద్దిపాటు రుసుము మాత్రమే నిర్వహణ ఖర్చు మాత్రమే) మూడు అంతస్తులలో 320 రూములతో రెండు ఎకరాల వైశాల్యములో కలదు.
అఖిల భారత సిద్ధిక్షేత్ర సాయిభక్త నివాస్ ట్రస్ట్
సాయి ద్వార్ లైన్, పింపుల్ వాడి రోడ్, షిర్డి ఫోన్ : : 02423-256178
శ్రీ ఆనందసాయి అన్నపూర్ణ ఛారిటబుల్ ట్రస్ట్
డోర్ నెం.1613, పెంపుల్ వాడి రోడ్, దత్తా నగర్, షిర్డి.
ఫోన్ : 08888988822. 08888479756
దేవాలయం నుండి కేవలం ఒక కిలోమీటరు దూరంలో కలదు.
స్వామి నిత్యాన్నదానం : మధ్యాహ్నాం 1.00 నుండి 02.30 వరకు రాత్రి 08.00 నుండి 09.00 వరకు
(విరాళాలు ఇవ్వవచ్చు. మీ పేరుమీద అన్నదానం జరుపబడును)
వసతి సౌకర్యం కలదు (ఒక్కొరికి రూ.100 మాత్రమే)