1 సరైన సమాచారం/సహాయం కోసం షిర్డి టెంపుల్ బస్టాండ్ ఎదురుగా ఉన్న రిసెప్షన్ సెంటర్‌లో సంప్రదించగలరు. తరువాత సమాచార కేంద్రంలో రూముల కోసం సంప్రదించవచ్చు.
2. సమాధి మందిరం సమీపంలో ఉన్న దేవస్థానం బుక్‌షాప్‌లో సాయిబాబా సాహిత్యం అన్ని భాషలో లభించును.
3. పూజా సామాగ్రి అమ్ము వ్యాపారస్తులతోదేవస్థానమునకు ఎటువంటి సంబంధము లేదు. భక్తులే రేట్లు విచారించి కొనుగోలు చేయగలరు.
4. సమాచార కేంద్రం నందు సామానులు భద్రపరచుకొనుటకు నామమాత్రపు రుసుముతో లాకర్లు లభించును.
5. హారతి మరియు పండుగ సమయాలలో రద్దీ ఎక్కువగా ఉండుట వలన భక్తులు తమ నగల పట్ల జాగ్రత్తగా
ఉండగలరు.
6. బాబావారి పవిత్ర పాదుకలు సాయిబాబా మందిరంలో మాత్రమే కలవు.
7. దేవస్థానంచే నడుప బడుచున్న ప్రసాదాలయం మరి టీ దుకాణంలో భోజనం మరియు టీ తగ్గింపు రేట్లలో పొందగలరు.
8. డొనేషన్స్ ఇవ్వగోరు వారు దేవస్థానం ఆఫీస్ నందు మాత్రమే సంప్రదించగరు.
9. దేవాలయ ప్రాంగణములోనికి సెల్ ఫోన్స్, కెమేరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించబడవు. ఈ వస్తువులను మరియు చెప్పులను దేవాలయ ప్రాంగణమునకు దక్షిణ వైపున దేవస్థానం వారి చెప్పుల స్టాండ్ వద్ద భద్రపరచుకోవచ్చు.
10. ప్రసాదం కౌంటర్లు : భక్తుకుల గమనిక షిర్డి సంస్థానం (కో ఆపరేటివ్ సొసైటీ) వారిచే నడుపబడుచున్న కౌంటర్ల నందు మాత్రమే భక్తులు ప్రసాదాలు కొనుగోలు చేయగరు.
కౌంటర్ల వివరాలు :
11. 2 మరియు 3 గేట్ల బయట ప్రక్కన, 5 సమాధుల వెనుక
12.లడ్డూ ప్రసాదం : లడ్డూ ప్రసాదాు 1వ గేటు ఎదురుగా, పాత ప్రసాదాలయం బిల్డింగ్‌లో మాత్రమే అమ్మబడును. ఉదయం 6 గంట నుండి రాత్రి 10 గంటల వరకు అమ్మబడును.ఒక్కొక్క పాకెట్ ఖరీదు రూ.10 మాత్రమే. ఒక పాకెట్‌లో 3 లడ్డూలు
ఉండును.
13. సాయిబాబా వారి శేష వస్త్రాలు : సాయిబాబా వారికి కప్పబడిన శేష వస్త్రాలు ఇక్కడ అమ్మబడును. మరియు సాయిబాబా వారిని ముద్రించిన బంగారు, వెండి నాణెము అమ్మబడును. ఇది రైల్వే బుకింగ్ ఆఫీసు మరియు డొనేషన్లు స్వీకరించు ఆఫీసుకు దగ్గరలో కలదు (2వ గేటుకు దగ్గరలో)
కియోస్క్ (టచ్ స్క్రీన్స్) సౌకర్యం
సాయిసంస్థానం గురించి మరింత సమాచారం కోసంసాయి సంస్థానం వారు రెండు కియోస్క్ లను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.భక్తులు వీటి ద్వారా భక్తినివాస్ సమాచారం, సంస్థానం వారి పబ్లికేషన్స్, బస్ మరియు రైళ్ళ సమయలు మొదలగు వాటి గురించి తెలుకోవచ్చును. ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఇవి పనిచేయును.
రైల్వే బుకింగ్ ఆఫీస్ - షిర్డి: సాయిభక్తు సౌకర్వం కోసం రైల్వేవారు షిర్డిలో పారాయణ్ హాల్ దగ్గర కంప్యూటరైజ్డ్ బుకింగ్ ఆఫీసును నిర్వహిస్తున్నారు. ఇక్కడ నుండి దేశంలో అన్ని ప్రాంతాకు టికెట్లు రిజర్వ్ చేయుంచుకొనవచ్చు. రిజర్వేషన్ స్టేటస్‌ను విచారించుకొనవచ్చును. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు రిజర్వేషన్ కౌంటర్ పనిచేయును.
షిర్డికి దగరలో 5 రైల్వే స్టేషన్స్ కలవు
అవి : సాయినగర్ 2 కి.మీ దూరం
కోపర్‌గాన్ 16 కి.మీ. దూరం
శ్రీరాంపూర్ 39 కి.మీ.
నాగర్‌సోల్ 55 కి.మీ
మన్మాడ్ 60 కి.మీ.
ఈ స్టేషన్ ల నుండి షిర్డికి దేవస్థానం వారు బస్సులు నడుపుచున్నారు.