దేవస్థానం వారి ప్రసాదాలయం (భోజనశాల)
భక్తుల సౌకర్యం కోసం షిర్డి సంస్థాన్ వారు అత్యాధునిక భోజనశాల ఏర్పాటు చేశారు. నామమాత్రపు ధరతో కేవలం ఒకరికి రూ.10 తో భోజనం లభిస్తుంది. ఒక రోజుకు లక్షమంది భక్తులకు ఏర్పాట్లు గలవు. ప్రతి రోజు 30 నుండి 35 వేల మంది భోజనం చేస్తారు. పండుగలు మరియు సెలవులో 70 నుండి 80 వేల మంది భోజనం చేస్తారు. సంస్థానం వారు సంవత్పరానికి 190 మిలియన్ రూపాయలను భోజనం కోసం ఖర్చు పెడతారు. ప్రసాదాలయం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరచి ఉంటుంది. ప్రసాదం ముందు బాబా వారికి సమర్పించిన తరువాత భక్తులకు వడ్డిస్తారు. భక్తు అన్నదానంకు డొనేషన్స్ ఇవ్వవచ్చు. భక్తులకు నెలవారీ భోజన టికెట్స్ ఇస్తారు.
షిర్డి సంస్థానం వారు పాత ప్రసాదాలయం ఎదురుగా ఉన్న 2వ గేటు దగ్గర నుండి (లడ్డూ కౌంటర్ దగ్గర) ప్రసాదాలయంనకు
ఉదయం గం॥ 09-30ని॥ నుండి రాత్రి 09-00 గంట వరకు ఉచిత బస్సులు నడుపుచున్నారు.