ప్రధాన ప్రవేశ ద్వారం : పింపుల్ వాడి రోడ్‌లో వున్న 2వ గేటు ప్రక్క న వున్న ప్రధాన ప్రవేశ ద్వారం దర్శనానికి వెళ్ళుట ఉత్తమం. ఇక్కడ క్వూ కాంప్లెక్స్ నుండి శాంతి హాల్‌కు తరువాత భక్తి హాల్ ఇక్కడ నుండి ఇంకా 6 ద్వారములు (కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్య ద్వారములు)కలవు. మొత్తం తొమ్మిది ద్వారములు (నవ విధ భక్తి ద్వారములు) దాటిన తరువాత బాబావారి సమాధి మందిరానికి ప్రవేశం.
గెట్ 1 : ఆలయానికి పశ్ఛిమ దిశలో నగర్-మన్మాడ్ రోడ్డులో కలదు. ఈ గేటు ద్వారా భక్తులు ఆలయ ప్రాంగణములోనికి మాత్రమే ప్రవేశించగరు. సాయిబాబా వారిని దూరం నుండి కిటికీ ద్వారా ముఖదర్శనం మాత్రమే చూడవచ్చు. సాయిబాబా వారి విభూది తీసుకోవచ్చు. మ్యూజియం మరియు సమాధుల చూడవచ్చు.
లెండీ బాగ్ తోట, సాయిబాబావారి బావిని చూడటానికి వీలు పడదు. ఈ గేటు ద్వారా ప్రవేశించిన వారు 4 వ గేటు ద్వారా బయటకు రావచ్చు. పింపుల్ వాడి రోడ్‌లో వున్న 2వ గేటు ప్రక్క న వున్న ప్రధాన ప్రవేశ ద్వారం దర్శనానికి వెళ్ళుట ఉత్తమం.
గేట్ 3 : తూర్పు వైపున ఉన్న ఈ మార్గం పింపుల్ వాడి రోడ్ నుండి బయటకు దక్షణముఖ హానుమాన్ మందిరం, ద్వారకా మాయి, చావిడి,అబ్దుల్ బాబా ఆశ్రమమునకు వెళ్ళును. ఇక్కడ ఎడమ ప్రక్కనుండి సాయిబాబా ముఖదర్శనము మాత్రమే సాధ్యము. కుడి ప్రక్క నుండి నడవలేని వృద్ధులు, వికలాంగుకు మాత్రమే ప్రవేశము. వీరు తోడుగా ఒకరిని తీసుకు వెళ్ళవచ్చు