Somanath Temple….సోమనాథ క్షేత్రం గుజరాత్ జ్యోతిర్లింగాలలో మొదటిది ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం గుజరాత్‌లో ఉన్నది. స్కందపురాణంలో ఈ క్షేత్రం గేరించి వివరించబడి ఉన్నది. దక్షప్రజాపతి యొక్క పుత్రికలలో 27 మందిని చంద్రుడు పెళ్ళాడుతాడు. వారిలో రోహిణి పట్ల ప్రత్యేక ప్రేమ కనపరుస్తాడు. దీంతో కోపోద్రికుడైన దక్షుడు చంద్రుని శపిస్తాడు. దీంతో చంద్రుడు తన తేజస్సును, కళను కోల్పొతాడు. అప్పుడు చంద్రుడు రోహిణితో సహా ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఉన్న స్పర్శలింగాన్ని కొలిచి తన తేజస్సును తిరిగి పొందుతాడు. అప్పటినుండి ఈ క్షేత్రం ప్రభాస తీర్థంగా పేరు పొందినది.
త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ ఇక్కడ బ్రహ్మశిలను స్థాపిస్తాడు. దేవతల కోరిక మేరకు శివభగవానుడు సోమనాధుడి పేరిట ఇక్కడ నివసిస్తాడు. ఈ పవిత్ర క్షేత్రం మహ్మద్ గజని చేత 1025లో నాశనం చేయబడినది. ఇక్కడ ఉన్న అపారసంపద ధనరాశులు గజనీ చేత కొల్లగొట్టబడినవి. తిరిగి ఈ దేవాలయం గుజరాత్ పాలకుడైన భీముడు మరియు మాళ్వారాజైన భోజుని చేత పునర్మించబడినది.
కాని మరలా 1300 సం॥లో అల్లావుద్ధీన ఖిల్జీ యొక్క సేనాధిపతైన అలాఫ్‌ఖాన్ చేత నాశనం చేయబడినది. తిరిగి చౌడసామ వంశస్థుడైన మహీపాల మహారాజుచే పునర్మించబడినది. తరువాత వరుసగా తురుష్కుమూకలచే 1390, 1490, 1530 సంవత్సరాలలో మరియు ఔరంగజేబ్ చే 1701లో నాశనం చేయబడినది.
చివరిగా స్వాతంత్య్రం వచ్చిన తరువాత సర్థార్ వల్లభాయ్ పటేల్ కృషివలన పునర్మించబడినది.
ఎలా వెళ్ళాలి : ఈ క్షేత్రం గుజరాత్‌లో ఘతియావాడ్ జల్లాలోని ప్రభాస్ తీర్థంలో ఉన్నది.
It is one of ‘Jyotirlings’ among the 12 existing Jyotirlings. The temple is located in Prabhas Kshetra in Saurashtra - Gujarat state. the region in which, it It is believed that, Lord Krishna left his mortal body in Prabhas Kshetra.
Another interesting thing about the place is that it is built on the shore of Arabian Sea and in between the temple and the South Pole, in a straight line there is no land area. Somnath temple was destroyed and re-built many times. The place also has a Somnath museum, Junagadh gate, beach and a sound and light show to amuse the pilgrims.