header

Sree/Sri Padmanabhaswamy temple... శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)

Sree/Sri Padmanabhaswamy temple... శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)
Sree padmanabhaswamy temple శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ) అనంతపద్మనాభుడు అనగా నాభి (బొడ్డు) యందు పద్మమును కలిగి అంతము లేనివాడు అని అర్ధం. శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం శ్రీమహావిష్ణువు ఆలయం. ఈ ఆలయం భారతదేశంలోని కేరళా రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంది. ఈ ఆలయం ప్రస్తుతం త్రివాంకోర్ రాజకుటుంబం అధ్యతలో నడుస్తున్న ధర్మకర్తల నిర్వహణలో నడుస్తుంది. ఈ ఆలయం శ్రీమహావిష్ణు యొక్క 108 దివ్యదేశములలో ఒకటి. 108 దివ్యాదేశములు అంటే శ్రీమహావిష్ణువు యొక్క ఆలయాలు ఉన్న దివ్యక్షేత్రాలు అని అర్ధం. శ్రీమద్భాగవతంలో బలరామదేవుడు తన తీర్ధయాత్రలో భాగంగా శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం అనే ఈ దేవాలయాన్ని దర్శించినట్లు, ఇక్కడ ఉన్న పంచప్సరసులో(పద్మతీర్ధంలో) స్నానం చేసినట్లు అలాగే పది వేల ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు తెలుస్తుంది. తమిళ ఆళ్వారులు రచించిన దివ్యప్రబంధంలో కూడా ఈ ఆలయం ప్రస్తుతించబడింది(6వ శతాబ్ధం-9వ శ). క్రీ.శ 16వ శతాబ్ధం అంతా ఈ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అపుడు ఈ ఆలయ సుందరగోపుర నిర్మాణం జరిగింది. ఈ ఆలయం ప్రసిద్ధ తిరువట్రార్ శ్రీ ఆదికేశవపెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం. ఈ ఆలయం కారణంగా కేరళా రాజధాని నగరానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. 'తిరు అనంత పురం ' అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని యొక్క పవిత్ర ఆలయం అని అర్ధం. ఈ నగరానికి అనంతపురం, శయనంతపురం అనే మరి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఆనందం అంటే పద్మనాభస్వరూపమే. హిందుధర్మం భగవంతుడి రూపం సచ్చిదానందం అని చెప్తుంది. (సంపూర్ణ సత్యం, సంపూర్ణ జాగృతి మరియు సంపూర్ణ ఆనందం). ఆలయ గర్భగృహంలో ప్రధాన దైవమైన పద్మనాభస్వామి అనంతశయనం భంగిమలో (అనంతశేషుడి తల్పం మీద యోగనిద్ర)ఉంటాడు. ట్రివాంకోర్ మహారాజా తనకు తానే పద్మనాభదాసుడని నామకరణం చేసుకున్నాడు. ముఖద్వారం వద్ద హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్న వారికి మాత్రమే ప్రవేశం అన్న ప్రకటన ఉంటుంది. భక్తులకు లోపల ప్రవేశించడానికి ప్రత్యేకమైన వస్త్రధారణ చేయాలన్న నియమం కూడా ఉంది. ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన తిరుపతి తిరుమల వడ్డి కాసుల వాడు... ఈ మధ్య కాలంలో కేరళ తిరువనంత పురంలోని అనంత పద్మ నాభ స్వామి వారి దేవాలయం లో బయల్పడిన అనంత సంపద తో వజ్రాలు, వైడుర్యాలు, టన్నుల కొద్ది బంగారు ఆబరణాలు మొదలగు వాటితొ లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపదతో మొదటి స్థానంలొ నిలబడగా రెండో స్థానంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడు రెండో స్థానంలో నిలవాల్సి వచ్చింది

Sri Padmanabha Swamy Temple Thiruvananthapuram is one of the 108 Divya Desams (sacred dwellings of Lord Vishnu) and the capital city of Kerala. Lord Vishnu appears in the form of Lord Padmanabhaswamy. The elegant and splendid idol of Lord Vishnu is reclining over a 5 hooded serpent called Anantha. The idol of the Lord is very fascinating as it displays the supreme trinity of Brahma, Vishnu and Shiva. Out of the navel of Lord’s statue a lotus is seen as coming out over which Lord Brahma is sitting. That is why Vishnu is also called Padmanabha, i.e. lotus-navel. Under the right palm of the stretched out hand of Padmanabha there is a Shiva lingum , completing all three powers into one.
Note : 01. Sree Padmanabhaswamy temple can be visited only by the Hindus.
02. There is a strict dress code for temple entrance. For men dhoti without any kind of shirt and women sari or skirt and blouse.
How to go : well connected trains to Thiruvananthapuram . AP people can go from Hyderabad- Vijayawada- nellore-chittor-tirupati-guntur (by train)
Official website: www.sreepadmanabhaswamytemple.org/