Vaishno Devi Temple...వైష్ణవ దేవి ఆలయం
వైష్ణవ దేవి ఆలయం వైష్ణవ దేవి ఆలయం ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం.
ఈ పుణ్యక్షేత్రం వైష్ణవ దేవి కొండలపై నెలకొని ఉన్నది. హిందువులు వైష్ణవ దేవినే మాతా రాణి అని, వైష్ణవి అని కూడా పిలుస్తారు. ఈ అమ్మ వారి ఆలయం ఉత్తర భారతాన జమ్ము జిల్లాలోని కాట్ర లో వున్నది.
ఈ ఆలయం ఉత్తర భారత్ లోని జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో జమ్ముకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో వున్నది. ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శేణి లో ఉన్నది. జమ్ము నుండి 50 కిలో మీటర్ల దూరంలో వున్న కాట్రా ప్రాంతానికి హెలి కాప్టర్ల లో వెళ్లవచ్చు. ఇతర వాహనాలు వుంటాయి. అక్కడి నుండి కాలి నడకన, గుర్రాలమీద,
పల్లకిల్లో ఎలాగైన వెళ్లవచ్చు. ఇక్కడికి ఆలయం సుమారు 15 కిలో మీటర్ల దూరంలో వున్నది. ఈ దారి చాల కష్టతరమైనది. తిరుపతి కొండ ఎక్కేవారు గోవిందా గోవింద అని అరుస్తున్నట్లె ఇక్కడ కూడ కొండ ఎక్కేవారు జై మాతాదీ అంటు అరుస్తుంటారు. ఇంకా చాల దూరం వుందనగానే మాతాదీ ఆలయం కనిపిస్తూనే వుంటుంది. ఈ ఆలయం వున్న ప్రాంతాన్ని భవన్ అని అంటారు.
భక్తులను గ్రూపులుగా విభజించి వారికి ఒక నెంబరిస్తారు. దాని ప్రకారం భక్తులను ఆలయంలోనికి అనుమతిస్తారు. ఆలయంలోపలికి సెల్ ఫోన్లు, కెమరాలు, అలాగే తోలుతో చేసిన ఏ వస్తువును అనుమతించరు. కనుక వాటిని కలిగి వున్నవారు వాటిని అక్కడే లాకర్లలో భద్రపరుచు కోవచ్చు. వైష్ణో దేవి మూడు రూపాల్లొ దర్శనమిస్తుంది. అవి మహాకాళి, మహా లక్ష్మి, సరస్వతి.
ఆలయానికి వెళ్లే దారిలో ఇతర పురాతనమైన చిన్న ఆలయాలు కూడ వున్నాయి.
Vaishno Devi Temple
Maa Vaishno Devi and is located at an altitude of 5200 ft in a mountain called Trikuta.
Vaishno Devi is present here in the form of three rock heads, called the Pindies, instead of a statue. Due to the strong faith of the people, every year millions of them come to take the blessings of Maa Vaishno Devi. It is said that it is Maa Vaishno who decides her visitors. It is she who calls her devotees to her doorsteps. Anyone making a successful journey to her shrine is there because of her wish
Visiting Season : This Temple is open all round the year
How to go : Vaishno Devi Mandir is in Jammu and Kashmir, near Katra town. 65 km to Jammu. From Katra - 15 km. Horses and pallakis
are available for rent. Very difficult route. To reach this temple by trekking about 12 km from Katra (Base Camp)
Official website : https://www.maavaishnodevi.org <