Virupaksha Temple, Hampi.... విరూపాక్ష దేవాలయం, హంపి
సుమారు పదిహేను వందల ఏళ్లనాటి ఆ ఆలయం అలనాటి అపురూప శిల్పకళావైభవానికి నిదర్శనం. విరూపాక్షాలయంతో బాటు విజయనగర సామ్రాజ్య స్థాపనకు ఆద్యుడైన విద్యారణ్యస్వామి వారి ఆలయం, గణపతి దేవాలయం, కోదండ రామాలయం, అచ్యుతరాయల గుడి, బదివి లింగం, ఉగ్రనరసింహస్వామి ఆలయాలతోపాటు గజశాల, రాణిస్నానపు గది, కమల మహల్, రాతిరథం, రామాయణ మహా కావ్యంలో వర్ణించిన పంపా సరోవరం, రుష్యమూక పర్వతం చూస్తుంటే వేల ఏళ్లనాటి సాంస్కృతిక వారసత్వం కనుల ముందు సాక్షాత్కరించి నట్లనిపిస్తుంది.
విరూపాక్ష దేవాలయం ప్రత్యేకత మొత్తం ఎత్తైన ఆలయ గోపురాలలోనూ, ప్రాకారాలలోనూ, సజీవ శిల్పాలలోనూ కనిపించి కనువిందు చేస్తుంది. విదేశీ యాత్రికులు, చరిత్రకారులు సైతం హంపీ విజయనగర సామ్రాజ్యంలోని విరూపాక్ష దేవాలయపు వైభోగాన్ని గురించి తెలిపారంటే ఈ ఆలయ ప్రాముఖ్యం ఎంతటిదో తెలుస్తుంది...
హంపి వీధి కి పశ్చిమ చివర విరూపాక్ష దేవాలయం ఉన్నది. 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గాలి గోపురం విరూపాక్ష దేవాలయం లోనికి స్వాగతం పలుకుతుంది. దేవాలయంలో ప్రధాన దైవం విరూపాక్షుడు(శివుడు). ప్రధాన దైవానికి అనుసంధానంగా పంపాదేవి గుడి, భువనేశ్వరీ దేవి గుడి ఉంటుంది. ఈ దేవాలయానికి 7 వ శతాబ్ధం నుండి చరిత్ర ఉన్నది. విరూపాక్ష-పంపా ఆలయం విజయనగర సామ్రాజ్యం కంటే ముందు నుండి ఉన్నదని శిలాశాసనాలు చెబుతున్నాయి. 10-12 శతాబ్ధంకు చెందినవి అయి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా.
చరిత్ర ఆధారాల ప్రకారం ప్రధాన దేవాలయానికి చాళుక్యుల, హోయసళులు పరిపాలనలో మార్పులు చేర్పుల జరిగాయని అయితే ప్రధాన ఆలయం మాత్రం విజయనగ రాజుల కాలంలో నిర్మించారని అంటారు. విజయనగర రాజులు పతనమయ్యాక, దండయాత్రల వల్ల 16 వ శతాబ్ధానికి హంపి నగరం లోని అత్యద్బుత శిల్ప సౌందర్యం నాశమైపోయింది. విరూపాక్ష-పంపా ప్రాకారం మాత్రం 1565 దండయాత్రల బారిన పడలేదు. విరూపాక్ష దేవాలయంలో దేవునికి ధూప,దీప నైవేద్యాలు నిర్విఘ్నంగా కొనసాగాయి. 19 వ శతాబ్ధం మొదలులో ఈ ఆలయం పైకప్పు పై చిత్రాలకు, తూర్పు , ఉత్తర గోపురాలకు జీర్ణోద్ధరణ జరిగింది.
ఆలయానికి ఉత్తర దిక్కున రత్నగిరి గోపురం, ఆ గోపురాన రత్నగర్భ వినాయకుడితో సహా మరికొన్ని సన్నిధులున్నాయి. విరూపాక్షాలయానికి వెనుకవైపున విద్యారణ్యస్వామివారి సన్నిధి ఉంది. ఇక్కడ ఒక చిత్రమేమిటంటే... విద్యారణ్యస్వామి ఆలయం ముందువైపున ఉన్న రాతిగుహలో శ్రీ విరూపాక్షస్వామి ముఖద్వార గోపురం తలకిందులుగా కనపడుతుంది. సూర్యుడెక్కడున్నా, ఏ వేళప్పుడైనా గోపుర బింబం మాత్రం చెక్కుచెదరకుండా స్థాణువులా అలాగే నిలిచి కనిపిస్తుంది.
ఈ దేవాలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. 9 ఖానాలతో 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గోపురములోని రెండు ఖానాలు రాతితో నిర్మించబడ్డాయి. మిగతా 7 ఖానాలు ఇటుకలతో నిర్మించబడ్డాయి. ఈ తూర్పు గోపురం నుండి లోపలికి ప్రవేశిస్తే బయటి నుండి ఆలయంలోకి వెళ్ళే మొదటి ప్రాకారం స్తంభాలు లేకుండా ఆకాశం కనిపించేటట్లు ఉంటుంది. ఈ ప్రాకారాన్ని దాటి లోపలికి వెళ్తే స్తంభాలతో కూడి కప్పబడిన వసారా ఉంటుంది. స్తంభాలతో కూడి ఉన్న వసారాలో చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి. వీటిని కూడా దాటి లోపలి ప్రాకారంలోకి వెళ్ళితే గర్భ గుడి వస్తుంది.
తుంగభద్రా నది నుండి ఒక చిన్న నీటి ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి గుడి వంట గదికి నీరు అందించి బయటి ప్రాకారం ద్వారా బయటకు వెడుతుంది. ఈ ఆలయ అభివృద్ధిలో శ్రీ కృష్ణదేవరాయల పాత్ర ఎంతో ఉన్నదని లోపలి ప్రాకారం ఉన్న స్తంభాల వసారాకూడా.
దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి బెంగళూరుకు రైళ్లు, విమానాలు ఉన్నాయి. అక్కడినుంచి హోస్పేటకు బస్సులు, రైళ్లు ఉన్నాయి. కొన్ని బస్సులు, రైళ్లు నేరుగా హోస్పేటకు వెళ్లేవి ఉన్నాయి. హోస్పేటనుంచి హంపీకి క్యాబ్‌లు లేదా ట్యాక్సీలలోలేదా . ప్రైవేటు వాహనాలలో వెళ్లవచ్చు. హంపీలో వసతి ఖరీదైనది.కానీచిన్న హోటళ్లు, లాడ్జీలు కూడా ఉన్నాయి.
ఎలా వెళ్లాలి?
కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిజిల్లా హోస్పేటకు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది హంపీ. అంటే బెంగళూరు నుంచి 350 కిలోమీటర్లు పైగా ఉంటుంది. హైదరాబాద్ వాసులు బెంగళూరు నుంచి వెళ్లేబదులు నేరుగా అక్కడి నుంచే హోస్పేట వెళ్లడమే సులువు. దగ్గర d of time. Shiva in the form of Virupaksha is the consort of local goddess Pampa and that is why the temple is also called Pampapathi temple. Many festivals take place in the temple celebrating the engagement and wedding of the couple.
In the month of February the annual chariot festival is celebrated here
The temple continues to prosper and attracts huge crowds for the betrothal and marriage festivities of Virupaksha and Pampa in December.
People in Andhra Pradesh can go by train rout : Vijayawada-Guntur-Vinukonda-Nandyala-Guntakal-Bellary-Hospet.
Hyderabad-deccan -Raichur- Bellary- Hospet