header

Yamunotri... యమునోత్రి

Yamunotri... యమునోత్రి
yamunotri temple యమునోత్రి యమునోత్రి యమునోత్రి అంటే యమునానది జన్మస్థలము. యమునా నది జన్మించిన ఈ ప్రదేశములో యమునాదేవి ఆలయము ఉంది. ఈ ఆలయం టెహ్రీ గార్వాల్ మహారాజాచే నిర్మించబడినదని కథనం. ప్రస్తుత ఆలయం జయపూర్ మహారాణి గులారియా 19వశతాబ్ధంలో నిర్మించబడింది.పాత ఆలయం వాతావరణం మరియు ఇతర కారణాల వలన శిధిలస్థితికి చేరుకున్న తరువాత జయపూరు రాణిచే ఆలయం పునర్నిర్మించబడింది. కొన్ని చిన్న చిన్న ఆశ్రమాలు మరియు గెస్ట్‌హౌసులు కాక ఆలయసమీపంలో నివసించడానికి వసతులు తక్కువ. యాత్రీకులు సమీపంలోని రాణిచెట్టి తదితర ప్రాంతాలలో బసచేసి ఆలయానికి చేరి నదీమాతను దర్శించి వెనుతిరుగుతుంటారు. ఇక్కడి ఉష్ణకుండ స్నానం యాత్రీకుల శ్రమాంతర ప్రయాణానికి కొంత సేదతీరుస్తుంది.
యమునా నది కథనం
సూర్యుని భార్య అయిన సంధ్యాదేవికి ముగ్గురు సంతానం. వారు శని,యముడు మరియు యమున. సంధ్యాదేవి సూర్యతాపానికి ఓర్వలేక తన ఛాయను తన స్థానంలో తన ఛాయను ఉంచి తపమాచరించడానికి వెళ్ళింది. తరువాత ఛాయాదేవి సంధ్యాదేవి కుమారుల పట్ల కొంత అశ్రద్ధను చూపించసాగింది. ఒక రోజు ఛాయాదేవి తన కుమారులకు ఆహారాన్ని అందించి సంధ్యా దేవి సంతానానికి ఆహారాన్ని అందించడానికి నిరాకరించడంతో శని కోపించి ఛాయాదేవిని కాలితో తన్నాడు. ఛాయాదేవి కోపించి శనిని కుంటివాడివికా శపించింది.ఇది గమనించిన సూర్యుడు శనిని తల్లిని తన్నిన కారణమడిగాడు,శని చెప్పినది విని సూర్యునికి ఛాయా దేవి మీద సందేహం కలిగి కన్న తల్లివైతే ఇలా చేయవు అసలు నీవెవరు అని ఆమెను నిలదీయగా తను సంధ్యను కానని ఆమెచే నియమించబడిన ఛాయాదేవినని నిజం చెప్పింది. ఈ సంఘటన తరువాత శని యముడు ఆప్రదేశాన్ని విడిచి పోతారు. యముడు శివునికి సహాయంగా మరణానంతరం ప్రాణులకు పాపం చేసినందుకు దండననిచ్చే నరకాధిపతి అయ్యాడు. దండన ఇవ్వడంలో సమానంగా వ్యవహరిస్తాడని పురాణ కథనం. అన్నదమ్ముల వియోగాన్ని సహించలేక యమున కన్నీరు మున్నీరుగా ఏడ్వగా ఆమెకన్నీరు నదిగా ప్రవహించినట్లు పురాణ కథనం కొన్నిచోట్ల ప్రచారంలో ఉంది.
గుడికి చేరే మార్గాలు
యమునోత్రి ఆలయం చేరడానికి హనుమాన్ చెట్టి జానకి చెట్టి వరకు వ్యానులు వెళతాయి.అక్కడినుండి గుర్రం,డోలీ ,బుట్ట మరియు కాలి నడకన ఆలయం చేరుకోవాలి.డోలీ,గుర్రం,బుట్టలలో తీసుకు వెళ్ళడానికి భారత ప్రభుత్వం నిర్ణయించిన వెలకు ధనం చెల్లించాలి. అక్కడక్కడ విశ్రాంతి కోసం ఆగినప్పుడు డోలీవాలాలూ గుర్రాలను నడిపే వారు బుట్టలలో గుడికి చేర్చే వాళ్ళ కోరికను అనుసరించి వారికి ఆహార పానీయాల ఖర్చు యాత్రీకులు భరించడం ఒక ఆనవాయితీ. ఇక్కడ యాత్రీకులను ఆలయానికి చేర్చే పనిలో ఘడ్వాల్,మరియు బర్గూరు నుండి పనివాళ్ళు వస్తూ ఉంటారు.ఆలయానికి కొంచందూరం నుండి యాత్రీకులు కాలినడకన గుడిని చేరాలి. డోలీ నడిపే వారిలో ఒకరు యాత్రీకులకు తోడుగా వచ్చి దర్శనానికి సహాయం చేస్తారు.వారు తిరిగి యాత్రీకులను డోలీ వరకు తీసుకు వచ్చి బయలుదేరిన ప్రదేశానికి యాత్రీకులను చేరుస్తారు.అక్కడినుండి తిరిగి హనుమాన్ చెట్టి వరకు వ్యానులలోనూ,జీపులలోనూ చేరాలి.ఇవి బాడుగకు సులువుగానే లభిస్తాయి.
Yamunotri Temple Yamunotri temple was built in the 19th century in the Uttarkashi district of Uttarakhand. Due to natural disasters. Yamunotri was damaged and rebuilt twice Yamunotri is dedicated to Yamuna River, which is the second holiest river of India,Yamunotri is one of the four Chota Char Dham sites. Located at the height of 3291 meters, the shrine of Mother Yamuna holds the idol of Goddess, which is built in black marble. Mother Yamuna spends the winter at a nearby village known as village Kharsali. The surroundings of the Yamunotri temple have many hot water springs to the delight of the visiting pilgrims
Visiting Season : Akshaya Tritiya (April or May).- Deepavali
How to go : Yamunotri Temple is in Uttarkashi district of Uttarakhand. No roads to Yamunotri temple, so it has to be reached by trekking for a few kilometers. Nearest places Rishikesh, Haridwar, Dehradun.
13 kms from Hanuman Chatti town and 6 kilometers from janki chetty. Horses and pallakis are available for rent.
The hike from Hanuman Chatti to Yamunotri is very picturesque with beautiful views of a number of waterfalls.