పేపర్ స్వీట్ లేక పూతరేకులు అనగానే ఆత్రేయపురం గుర్తుకువస్తుంది. ప్రత్యేకమైన రుచితో నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ పూతరేకుల జన్మస్థానం ఆత్రేయపురం.
అత్రి మహాముని తపస్సు చేసిన ప్రాంతం కాబట్టి ఆత్రేయపురం అని పేరు వచ్చిందంటారు. ఆత్రేయపురంలో తయారయ్యే పూతరేకులు దేశ, విదేశాలకు ఎగుమతి అవుతాయి.
ప్రపంచవ్యాప్తంగా పేరుపొందాయి. 300 సంవత్సరాల క్రితమే ఆత్రేయపురంలో పూతరేకుల తయారీ ప్రారంభమైందని చెబుతారు. ప్రస్తుతం 300 కుటుంబాలు పూతరేకులను తయారు చేస్తూ జీవోనోపాధి పొందుతున్నాయి.