తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న మారేడుమిల్లి ప్రాంతం ప్రకృతి ప్రేమికుల స్వర్గధామం. అందమైన పర్యాటక స్థలం. తూర్పు కనుమలలో ఉన్న ఈ అటవీ ప్రాంతం మారేడుమిల్లి గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో మారేడుమిల్లి – భద్రాచలం రోడ్డలో ఉంది.
కొండలమీద నుండి ప్రవహించే అనేక చిన్న చిన్న జలపాతాలు చూపరులకు కనువిందు చేస్తాయి. .
ఇక్కడ స్థానికులు తయారుచేసే బొంగు చికెన్ రుచే వేరు. తప్పకుండా ఆస్వాదించదగ్గది. చాలామంది పర్యాటకులు బొంగడూ చికెన్ తినటానికే ఈ ప్రాంతానికి వస్తారు.