ఓ మాంచి ధమ్ బిర్యానీ... పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు అన్ని చోట్లా దొరుకుతుంది.
కాజా అనగానే జీడిపప్పులు కానీ వేసి చేసే బిర్యాని కాదు. కాజా అనేది ప్రాంతం పేరు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు వెళ్లే రోడ్డులో పదిహేను నిమిషాలు ప్రయాణిస్తే కాజ అనే చిన్న ఊరొస్తుంది. మామూలుగా అయితే ఈ ఊరి పేరు ఎవరికీ తెలియదు. కానీ ఇక్కడ దొరికే బిర్యానీతోనే ఈ చిన్న పల్లె పేరు ఈ ప్రాంత వాసులకు ఫేమస్ అయిపోయింది. అందుకనే ఈ దుకాణానికీ ‘కాజా బిర్యానీ’ అనే పేరొచ్చేసింది.
మేళం రామాంజనేయులు చికెన్‌తో పంజాబీ ధమ్ బిర్యానీ చేయడం నేర్చుకుని ‘శ్రీరామ్ పంజాబీ బిర్యానీ’ పేరుతో దీన్ని చిన్న పూరి పాకలో ప్రారంభించాడు. కొంత కాలానికే ఆయన చేతి బిర్యానీ రుచి, ఆ ప్రత్యేకమైన మసాలా ఘాటు స్థానికులందరికీ తెగ నచ్చింది.
తారలు మెచ్చిన ఆయిల్‌లెస్ బిర్యాని...
సినిమాలు చిత్రీకరణ సందర్భంగా ఈ ప్రాంతానికి వచ్చే చిరంజీవి, శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, సిద్ధార్థ, ప్రభాస్...వంటి తారలు ఈ బిర్యానీ ఫేవరెట్లే. చుట్టుపక్కల షూటింగులకొచ్చే చాలా యూనిట్ల వాళ్లు ప్యాకప్ చెప్పేయగానే ఈ బిర్యాని పార్శిళ్లు తెప్పించుకునితినాల్సిందే.
ఈ చిన్న పల్లెకు దగ్గర్లోనే గోదావరి, దాని తీరంలో చాలా రిసార్టులు ఉన్నాయి. అక్కడికి వచ్చే పర్యటకులంతా ఈ బిర్యానీ రుచి చూసేందుకు వస్తుంటారు. ఇందులో విశేషం ఈ బిర్యానీలో....నూనె ఉపయోగించరు. చికెన్ కోసం వాడే మారినేషన్‌లో నేయ్యి వాడతారు. దాంతోనే ధమ్ తయారవుతుంది. నూనె వాడరు. బిర్యానీ గిన్నె పొయ్యి ఎక్కక ముందే బిర్యానీ పొట్లాలు ముందుగానే బుక్ చేసుకుంటారు. వరుసలో నిలబడి టోకెన్లు ముందుగా తీసుకున్న వారికే బిర్యానీ ప్యాకెట్......