కాకినాడ సుబ్బయ్య అనగానే భోజనం కంటే వారు చూపే ఆప్యాయత గుర్తుకు వస్తుంది. 1955 సం.లో ఈ హోటల్ ను ప్రారంభించారు. 90 రకాల గోదావరి రుచులను వడ్డిస్తూ ప్రతి ఒక్కరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ కొసరి కొసరి వడ్డిస్తారు.
మొదట్లో ఈ హోటల్ పేరు శ్రీకృష్ణా విలాస్. కానీ ఈ హోటల్ ను ప్రారంభించిన సుబ్బయ్య గారు అందరినీ ఆప్యాయంగా సలకరిస్తూ వడ్డిస్తుండటంతో ఈ హోటల్ సుబ్బయ్యగారి హోటల్ మారింది.
ఆయన తరువాత ఆయన వారసులు కూడా ఇదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో పేరుపొందిన ఈ హోటల్ కు వేరు ప్రాంతాలనుండి వచ్చిన వారుకూడా తప్పనిసరిగా ఇక్కడే భోజనం చేసి వెళతారు.