header

Rajahmundry Rose Milk….రాజమండ్రి రోజ్ మిల్క్

Rajahmundry Rose Milk….రాజమండ్రి రోజ్ మిల్క్

రెడీమేడ్ గా దొరికే శీతలపానీయాలు….రాజమండ్రి రోజ్మిల్క్ రుచికి సరిపోవు అంటారు రోజ్మిల్క్ అభిమానులు. ఈ ‘రోజ్మిల్క్’ దుకాణం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటలకు మూసేంతవరకూ రద్దీనే. సుగంధివేళ్లతో ప్రత్యేకంగా తయారుచేసే ఈ రోజ్మిల్క్ కు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే! చుట్టుపక్కల గ్రామాల నుండి పనిమీద వచ్చిన వాళ్లు.. రాజమండ్రికి వచ్చిన వాళ్లు కూడా ఇక్కడ ఈ రోజ్మిల్క్ని ఒక్కసారి రుచిచూడక మానరు.
సుగంధివేళ్లు ప్రత్యేకం...
పాలకు తోడు వేసవితాపాన్ని చల్లార్చి చలువ చేసే సుగంధి వేళ్లను వేసి చేయడం ఈ రోజ్మిల్క్ ప్రత్యేకం. సుగంధి వేళ్లు వేసి మరగబెట్టి చల్లార్చిన తర్వాత ఆ నీటిని వడకడతారు. వడగట్టిన ఆ నీటిలో రంగు కలిపి సిరప్ తయారు చేస్తారు. దీనిని పాలకు కలుపుతారు. ఆపై కోవా, బాదంపాలు వంటివి ఈ రోజ్మిల్క్ తయారీలో వాడతారు. ఇక్కడ రోజ్మిల్క్తో పాటు సేమ్యా, కోవా కూడా అద్భుతంగా ఉంటాయి.
ఆర్గానిక్ పాలతో ....
ఈ రోజ్మిల్క్కు నిత్యం వినియోగదారుల తాకిడి ఉండడంతో కల్తీలేని పాల కోసం సొంతంగా పాడి పరిశ్రమను ఏర్పాటు చేసుకున్నారు దుకాణ నిర్వహకులు. శుభ్రమైన వాతావరణంలో గేదెలు, ఆవులను పెంచుతూ వాటి నుంచి వచ్చిన పాలతోనే ఈ రోజ్మిల్క్ని తయారుచేస్తారు. ఆ పాలు కూడా సరిపోకపోవడంతో... బయట నుంచి కల్తీలేని పాలను కొంటుంటామని అంటున్నారు నిర్వహకులు గుబ్బా రామచంద్రరావు.
Main Road, Mangalavaripet, Rajahmundry