Air Freshner Plants .... గాలిని శుద్ధి చేసే మొక్కలు
ఆలోవెరా (కలబంద) మొక్క :
ఈ మొక్కలు గాలిలోని హానికారక ఫార్మాల్డి హైడ్, బెంజిన్లాంటి పదార్ధాల శుద్ధికి
ఎంతో ఉపయోగ పడుతుంది. కొత్తగా పెయింట్లు వేసిన ఇళ్లకూ ఇది మంచిది. సాధరణ మొక్కలకు భిన్నంగా ఇది రాత్రిపూట కార్పన్ డై ఆక్సైడ్ ను తీసుకొని అధిక మొత్తంలో ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. అందువలన పడక గదులలో
వీటిని పెట్టుకోవచ్చు.
పీస్ లిల్లీలు :
ఈ మొక్కలు శ్వాస ఇబ్బందులను కలిగించే ట్రైక్లోరో ఇధిలీన్, అమ్మోనియాలను గాలి నుంచి తొలగించేందుకు సహకరిస్తాయి.
క్రిస్మస్ కాక్టస్ చెట్లు :
ఎరుపు, తెలుపూ,నీలం ఇలా రకరకాల రంగులలో చెట్టునిండా పూలతో మనకు కనిపించే క్రిస్మస్ కాక్టస్ చెట్లు గాలిలోని విషపూరితాలను తొలగిస్తాయి.
అరేకాపామ్, బాంబూపామ్ :
ఒక్క ఎయిర్ ప్యూరిఫైర్ కొనేబదులు ఈ మొక్కలు కొని ఇంటిలో పెంచుకుంటే
సహజమైన సువాసనతో కళకళలాడు తుంటాయి.