header

Camellia Japonica.... కెమీలియా జపోనికా ....
firespike కెమీలియా జపోనికా ....
లేత గులాబీ మొదలు ఎరుపు, పసుపు, వంగపూవు రంగు వరకూ జపోనికా మొక్కలలో ఎన్నో రకాలున్నాయి. గులాబీరంగుమీద ఎరుపుచారలు, తెలుపుమీద గులాబీ చారలు ఇలా కలనేత రంగులలో లభిస్తాయి. ఉష్ణమండలాల నుంచి అతి శీతల ప్రాంతాలలోనూ ఇవి బ్రతుకుతాయి. కానీ చల్లని ప్రాంతాలలో బాగా పెరుగుతాయి. ఏడాదంతా పచ్చటి పొదలతో కళకళలాడుతూ ఉండటం, నిత్యం పూలుపూయడం వీటి ప్రత్యేకత. శీతాకాలంలో మాత్రం విరగబూస్తాయి.
అందుకే వీటిని రోజెస్ ఆప్ వింటర్ పిలుస్తారు. పొదలలాగా పెరిగే వీటిని తోటలకు అవుట్ లైన్ గా వేసుకోవచ్చు. విడి చెట్లను ఇంట్లో కుండీలలో పెంచుకోవచ్చు.
ఆకులూ,గింజలు అన్నీ....
జపోనికా ప్రసిద్ధమైన కెమీలియా చెట్టుకి సంబంధించినది. కాబట్టి ఈ పూల చెట్ల ఆకులు కూడా తేయాకులే. అందు వీటి ఆకుల నుంచి టీ పొడి తయారు చేస్తారు. ఈ ఆకులకుండే ప్రత్యేక సువాసన టీని ప్రత్యేకంగా తయారుచేస్తుంది. ఇక ఇందులోని గింజల నుంచి తీసే నూనెను సుబాకీ నూనెగా పిలుస్తారు. దీన్ని వంటనూనెగా వాడతాడు.
జుట్టుకీ, సౌందర్యసాధనాల తయారీలోనూ ఉపయోగిస్తారు. భారత్ తె సహా, అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా, చైనాలలో దీన్ని వ్యాపార పంటగా పండిస్తున్నారంటారు. ఈ మొక్కలను ఆన్ లైన్ లోనూ ఆర్డరిచ్చ కొనుగోలు చేయవచ్చు.