header

Chaina Lanter, Abutilan.....తొటకు కాంతులిచ్చే చైనా లాంతరు

Chaina Lanter, Abutilan.....తొటకు కాంతులిచ్చే చైనా లాంతరు
china lanten చైనాలాంతరు,చైనాగంటలు, పూలమాపుల్..... ఇలా అనేకరకాలుగా పిలిచేమొక్కిది. అసలు పేరు అబూటిలాన్, అబూటిలాన్ పిక్టవమ్ లేదా అబూటిలాన్ స్ట్రయేటమ్ అన్నది శాస్త్రీయనామం. ఇది గోంగూర, పత్తి, మందార కుటుంబమైన మాల్వేసికి చెందినదలి. పెద్దపొదలుగా ఆరేడు అడుగుల వరకు పెరుగుతుంది. ప్రూనింగ్ ద్వారా రెండు మూడు అడుగుల ఎత్తుకే పరిమితం చేయవచ్చు. గుబురుగా ముచ్చటగా పెరుగుతుంది. ఆకులు చూడడానికి గోంగూరనే పోలి ఉంటాయి. ఆకుపచ్చ రంగుతో కానీ పసుపు రంగుమచ్చలతో గానీ ఉంటాయి. ఈపసుపు రంగు మచ్చల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సాధారణంగా ఈమచ్చలు ఇతర మొక్కలలో వైరస్ వలన వస్తాయి. కానీ ఈ మొక్కకు కేవలం అందం కోసం దీన్ని సృష్టించారు శాస్త్రవేత్తలు. అంటే మొక్క ఆరోగ్యానికి అందానికీ నష్టం కలుగకుండా అందాన్ని పెంచేవైరస్ తో ఈ మచ్చలను తీసుకొచ్చారన్నమాట. చైనా లాంతరు పూలను చూడగానే. ...ఈ మొక్కది సార్ధక నామధేయం అనిపిస్తుంది. గంటల్లా, చైనా లాంతర్లా తిరగేసిన కప్పులలాగాకనిపిస్తాయి. వీటిపూలు పసుపు, నారింజ, ఎరుపు రంగులలోఉంటాయు ఒకేరంగులో, చారలతో కనువిందు చేసే రకాలు ఉన్నాయి. ఆకులతో నిండుగా ఉండే ఈమొక్క ఎప్పుడూ పూస్తూనే ఉంటుంది. సీతాకోక చిలుకలను ఆహ్యానిస్తుంది.

తేమ అవసరం :
చైనా లాంతరు మొక్కను మన వాతావరణంలో పెంచాలనుకుంటే దానికి తగిన తేమ అవసరం. మట్టి మిశ్రమంలో ఇసుక, కుళ్ళిపోయిన ఆకులను కలిపితే మంచిది. ఎండ ఎక్కువగా లేకుండా కొద్దిపాటి నీడ ఉండి చల్లగా ఉండేలా చూసుకోవాలి.చెట్లమధ్య పెంచుకోవాలి. లేదా నెట్ సాయంతో ఎండను తగ్గించుకోవాలి. ఎక్కువ ఉష్ణోగ్రతని ఈమొక్క తట్టకోలేదు. కొబ్బరిపీచుతో పాదుకు మల్పింగ్ చేయడం వల్ల మొక్కకు కావలిసిన తేమ, చల్లదనం అందుతుంది. చైనా లాంతరుకి భాస్వరం అవసరం. నెలకోసారి డిఏపి ఎరువుని వేయడంతో పాటు ఎముకలపొడి (బోన్ మీల్) ను మట్టి మిశ్రమంలో కలుపుకోవాలి. వాడేసిన కాఫీ, టీ పొడులను వేయవచ్చు. ఈ మొక్కకు క్రమంతప్పకుండా నీళ్ళపట్టాలి. లేదంటే ఆకులన్నీ రాల్చేసి ఎండిపోతుంది. నీళ్ళు మరీ ఎక్కవైనా ఇబ్బందే, అప్పుడప్పుడు నీళ్ళను చల్లుకుంటే మేలు.కొమ్మల చివర్లు కూడాఅప్పుడప్పుడూ కత్తిరస్ఉండాలి.ఈమొక్కకు రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువ. ఆసమస్యను నివారించటానికి వేప, పొగాకు కానుగ కషాయాలను చల్లుతూ ఉండాలి. మొక్కల చుట్టూశుభ్రంగా ఉంచుకోవాలి. శీర్ష కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు. రూటింగ్ పౌడరును ఉపయోగించి కోకోపిట్ మిశ్రమంలో నాటుకుంటే చక్కగా వేళ్లూనుకుంటుంది

బోడెంపూడి శ్రీదేవి (ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్) సౌజన్యంతో...