Lilli Pilli Flower Plants........లిల్లీ పిల్లీ మొక్కలు
తెల్లటి పూలు, రంగుల ఆకులతో ఈ చెట్లు నిండుదనంగా ఉంటాయి. వీటి శాస్త్రీయ నామం సిజీయం ఫ్లోరిబండా. వీటి పుట్టుక ఆస్ట్రేలియా, మన దేశంలో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం లోనికి వస్తున్నాయి.
రెండు నుంచి మూడు మీటర్ల ఎత్తులో పెరిగే మొక్కలు ఇవి. గుబులుగా నిలువుగా పెరుగుతూ కత్తిరించేందుకు అనుకూలంగా ఉంటాయి. వీటి లేత ఆకులు ముదురు ఎరుపురంగులో ఉండి క్రమంగా ఆకుపచ్చ వర్ణంలోనికి మారి మెరుస్తూ ఉంటాయి. వీటి పూలు చిన్నవిగా, తెలుపు రంగులో ఉండి మంచి వాసన వస్తాయి. వీటి కాయలు చిన్నగా ఆకులు, పూలూ మొత్తంగా ఆకర్షణీయంగా ఉంటాయి.
లిల్లీపిల్లి మొక్కలు టోపియర్ గా మలచటానికి అనుకూలంగా ఉంటాయి. ఈ మొక్కలను వరుసగా నాటి గోడలుగా పెంచుకోవచ్చు. కత్తిరించకుండా ఉన్నా కూడా చిన్న చెట్టులా ప్రకాశవంత మైన రంగుల ఆకులతో ప్రత్యేకంగా కనిపిస్తుంది.
ఈ మొక్కలు కుండీలలో పెంచటానికి అనువుగా ఉంటాయి సులువుగా పెంచుకోవచ్చ. కొద్దిపాటి నీడ చాలు సూర్యకాంతి పడినపుడు బాగా పెరుగుతాయి. మంచిసారవంతమైన, నీరు నిలవని మట్టి మిశ్రమంలో చక్కగా పెరుగుతాయి.
ఈ మొక్కలకు నత్రజని, పొటాష్, ఎక్కువగా ఉండే ఎరువులను వేసుకోవాలి. వర్మీకం పోస్ట్, బూడిదను మట్టి మిశ్రమంలో కలిపితే మంచిది. ఈ మొక్కకు ఫిల్లిడ్లు ఆశించడం వల్ల మొక్కలేత ఆకులపై చిన్న చిన్న బుడిపెలు వచ్చి
వికారంగా ఉంటాయి. అందుకే ఈ సమస్య వచ్చినపుడు రోగార్ రెం డు మిల్లీలీటర్లను నీటిలో కలిపి పదిరోజుల వ్యవధిలో రెండుసార్లు చల్లాలి. నర్సరీలలో ఈ మొక్కలు దొరకుతాయి.
బోడెంపూడి శ్రీదేవి (ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్) సౌజన్యంతో...