header

Lore Petalam.....లోరె పెటాలమ్

Lore Petalam.....లోరె పెటాలమ్
ముదురు గులాబీ రంగు పూలు, అండాకారంలో నిగారింపుతో కనిపించే ఆకులు లోరోపెటాలమ్ ప్రత్యేకత. వీటిలో అనేక రకాలున్నప్పటికీ, ఎక్కవ వాడుకలోకి వచ్చంది లోరోపెటాలమ్ చైనీ సుబ్రం. వీటికి బద్దెల్లాగుండే పూలరెక్కల వలన వీటికి ఆ పేరు వచ్చింది.ఈ మొక్కలు మూడునుండి ఐదుఅడుగుల ఎత్తువరకు పెరిగే పొద. ఆకులు గోధుమ కలిసిన ఎరుపు రంగులో అండాకారంలో కొనదేలి ఉంటాయి.
పూలు ముదురు గులాబీ రంగులో కంటికింపుగా కనిపిస్తాయి. ఒకటి రెండు సెంటీ మీటర్లలో బద్దెల్లాగా నాలుగు నుంచి ఆరు రేకలు ఉంటాయి. ఈ పూలుఏడాదంతా పూసినా సాధారణంగా డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఎక్కువగా పూస్తాయి.
కోరుకున్న ఆకృతిలో....లోరోపెటాలమ్ నెమ్మదిగా పెరిగే మొక్క. దీన్ని పెంచేందుకు నీరు నిలవని మట్టి మిశ్రమాన్ని తీసుకొని నాటుకునే కుండీలలో కోడిగుడ్డుపెంకులు, వాడేసిన కాఫీ పొడి కలిపితే మొక్క చక్కగా పెరుగుతుంది. అయితే ఈ మొక్కను మరీ లోతుగా నాటకూడదు.
బోర్డరుగాను,పొదగానూపెంచుకోవచ్చ. వీటిని దగ్గర దగ్గరగా నాటుకుని కావలసిట్లుగా పెంచుకోగలిగితే కోరుకున్నా ఆకృతిలో చూడముచ్చటగా అందంగా కనిపిస్తాయి.
ఈ మొక్కలను రాక్ గార్డెన్ లో రాళ్ళ మధ్య తేమఉండేలా లోతు చేసి నాటుకుంటే మంచిది. బోన్సాయ్ పద్దతిలో చక్కగా పెంచినా ఇదిప్రత్యేకంగా అందంగా కనిపిస్తుంది. పునాదుల పక్కనా, కాంక్రీట్ బాట పక్కనా ఇవి సరిగాపెరగవు. లోరోపెటాలమ్ కొద్దిగా కుదురుకుని వాతావరణాన్ని తట్టుకుంటే, సులువుగా పెరుగుతుంది. ఎండ ఛాయ ఎక్కువగా పడినప్పుడు ఎక్కువ పూలు పూస్తాయి. ఆకుల రంగు ప్రకాశవంతంగానూ ఉంటుంది. చక్కగా పెరుగుతుంది.
మొక్కకు చీడ పీడల సమస్య తక్కువ. లేత ఆకులకు రసంపీల్చే పురుగులు ఆశించకుండాఉండాలంటే నెలకోసారి వేప కషాయం చల్లాలి. నత్రజని, భాస్యరం ఎక్కువగాపోటాష్ తక్కువగా ఉన్నఅమ్మోనియం నైట్రో పాస్పేట్ 20:20:15 లేదా18:18:9 చొప్పున నెలకోసారి మొక్కలకు అందించాలి. కటింగుల ద్వారా, విత్తనాల ద్వారాఈమొక్కని ప్రవర్థనం చేయవచ్చు. నర్సరీలలో కొనుగోలుచేయవచ్చు.
బోడెంపూడి శ్రీదేవి (ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్) సౌజన్యంతో...

<