Miracle Fruits....మిరకిల్ పండ్లు
ఈ పండు ఏ రుచి కలిగి ఉండదు. కానీ ఈ పండు తిన్న అరగంట తరువాత ఏదీ తిన్నా తీపిగా ఉంటుంది. ఈ ప్రభావం అరగంట వరకు ఉంటుంది. మిరకిల్ పండులో ఉండే మిరాకిలిన్ అనే ప్రొటీన్
వల్ల ఇది సాధ్యం అవుతుంది.
దీని శాస్త్రీయనామం సిన్సెపాలమ్ డల్పీ పైకమ్. ఆరు నుండి పదిహేను అడుగుల ఎత్తు దాకా గుబురు పొదలా నెమ్మదిగా పెరుగుతుంది. పూలు తెల్లగా ఉంటాయి. దీని పండ్లు
ఎర్రగా రెండంగుళాల పొడవుగా ఉంటాయి. ఈ పండులో ఒకే గింజ ఉంటుంది. ఈ మొక్కల్ని పెంచటానికి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి తేమ ఉండే నీరు నిలవని సారవంతమైన
మట్టి మిశ్రమం కావాలి. ముఫ్పై శాతం కోకోపీట్, ఇరవై శాతం పశువుల ఎరువు, పదిశాతం ప్రెస్ మడ్ (ఇవన్నీ బయట నర్సరీలలో దొరకుతాయి) ఎముకల పొడి, వేపపిండి, ఇటుకల పొడి, ఎర్రమట్టి కలిసిన మిశ్రమం వాడాలి. ప్రెస్ మడ్ దొరకకపోతే వర్మీకం పోస్ట్ కలుపుకోవచ్చు. వాడేసిన కాఫీపొడి, కోడిగ్రుడ్డు పెంకులు వేస్తే మంచిది.
మిరకిల్ పండ్ల మొక్కలు రోజూ వర్షం పడే వాతావరణంలో బాగా పెరుగతాయి. అందుకే మన వాతావరణంలో పెంచుకున్నపుడు క్రమం తప్పకుండా నీళ్ళుపోయాలి.అప్పుడప్పుడు నీళ్ళు మొక్కలపై
చిలకరించాలి. పూర్తి ఎండలో కాకుండా కొద్దిపాటి నీడలో ఈ మొక్కలు చక్కగా పెరుగుతాయి. వీలైతే ఇతరమొక్కలూ, షేడ్ నెట్ కింద పెంచితే మంచిది. ఈ మెక్కలను పెద్ద కుండీలలో
పెంచితే మంచిది. ఎరువులు పెద్దగా వేయనవసరం లేదు.చీడపీడలు అంతగా ఆశించవు.. అప్పుడప్పుడు వేపకషాయం చల్లితే మంచిది. ఈ పండ్లు మధుమేహంతో బాధపడే వారు,
బరువు తగ్గాలనుకునే వారికి మంచిదంటారు. తీపి తిన్న అనుభూతిని కలిగిస్తాయి ఈపండ్లు. క్యాన్సర్ భాదితులకు కీమో ధెరపీ తరువాత నాలుకకు రుచి తెలియదు. అప్పుడు ఈ పండ్లు తినటంవలన ప్రయోజనం ఉంటుంది.
ఈమొక్కలు కాస్త ఖరీదైనవి. దొరకటం కూడాతక్కువ. ప్రత్యేకంగా చెప్పి తెప్పించుకోవలసి ఉంటుంది.
బోడెంపూడి శ్రీదేవి (ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్) సౌజన్యంతో...
<