header

Nandivardhanam Latha

లతలా అల్లుకునే నందివర్ధనం లత

లతలా అల్లుకునే నందివర్ధనం లత
మెరిసే ఆకులతో, గుత్తులుగా పూసే పువ్వులతో అందమైన పూలమొక్క నందివర్ధనం లత. దీని శాస్త్రీయ నామం కోనా మార్పా ప్రాగెన్స్.
అడవులలో పెరిగే ఈ అందమైన తీగ మొక్క బలంగా ఉంటుంది. పొడవాటి పెద్ద చెట్ల మీదకి కూడా అల్లుకుంటుంది. అయితే మన వాతావరణంలో ఇళ్ళలో,తోటలలో చిన్నదిగా పెరుగుతుంది. పందిరి బలంగా ఉండాలి. కంచెల మీదికి కూడా పాకించవచ్చు. ఆకులు ముదురాకు పచ్చరంగులో, ఈనెలతో ప్రస్పుటంగా కనిపిస్తుంది. లేత ఆకులు ఎరుపు కలిసిన లేతాకు పచ్చరంగులో ఉంటాయి. ఎప్పుడూ అందంగా ప్రత్యేకంగా కనిపించే ఈ లత అందం ఎండకాలంలో పూలు పూసేటప్పుడు తెలుస్తుంది. పూల గుత్తులు గరుడ వర్ధనం పూలను పోలి తెల్లని రంగుతో మధ్యలో పసుపు వర్ణంతో ఉండే ఈ పూలు చాలా అందంగా ఉండటమే కాకుండా అద్భుతమైన సువాసనతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మే నుంచి జులై వరకు ఈ తీగ పూలతో నిండి కన్నులపండుగా ఉంటుంది.
ఈ లతను పెంచేందుకు నీరు నిలవని సారవంతమైన మట్టి మిశ్రమం అవసరం.నేల తేమగా ఉండాలి. వాడిన టీపొడి,కాఫిపొడి, కుళ్ళిన ఆకులు, వేస్తే ఈ తీగ బాగా పెరుగుతుంది. కోనో మార్చాను చీడపీడలు పెద్దగా ఆశించవు. పిండి పురుగులు ఆశించకుండా వేప, వెల్లుల్లి కషాయం వంటివి చల్లితే సరిపోతుంది. పూలు ఎక్కువగా పూస్తుంది కనుగ పూలు రాకముందే ఎన్ పీ కె ఉండే సమగ్ర ఎరువును మూడు నాలుగు సార్లు వేస్తే మంచిది. తోటలు, పార్టీలు జరిగే చోట స్విమ్మింగ్ పూల్ ప్రక్కన ప్రత్యేకంగా కనిపించే ఈ మొక్కలను కత్తిరింపులు, కొమ్మంట్లు ద్వారా చక్కగా ప్రవర్ధనం చేసుకోవచ్చు.
ఔషధ గుణాలు
ఈ మొక్కలు పూలు, వేర్లను ఆయిర్వేదంలో చర్మవ్వాధులు, జ్వరం, మూత్రనాళ సమస్యలకు వాడతారు.
--బోడెంపూడి శ్రీదేవి, ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్ సౌజన్యంతో...........