header

Oregano, Vallegar Plants......ఒరెగానో – సువాసనలు.......

Oregano, Vallegar Plants......ఒరెగానో – సువాసనలు.......
vadamalli తక్కువ ఎత్తులో నేలకు సమాంతరంగా పచ్చగా పరచుకున్న పరదాలా కనిపిస్తుంది ఒరగానో. చక్కటి సుగంధద్రవ్య మొక్క ఒరగానో.. ఆరోగ్యానికీ, వంటలలో వాడేందుకు విరివిగా ఉపయోగించే దీనిని పెరట్లో పెంచుకుంటే ఎన్నో ఉపయోగాలు ఒరిగానో శాస్త్రీయ నామం వల్లేగర్ దేశవిదేశాల వంటలలో సుగంధ దినుసుగా వాడతారు.దీనిని అడవి మర్జోరమ్ అని కూడా అంటారు. అడుగు నుండి అడుగున్నర వరకు ఎత్తు పెరుగుతుంది. ఆకులు అండాకారంలో ఆలివ్ గ్రీన్ రంగులో ఉంటాయి. వీటి కంకులలో చిన్న చిన్నఊదారంగు పూలు పూస్తాయి. చక్కని సూర్యకాంతిలో బాగా పెరుగుతుంది. ఎండ సరిగా పడాలి. అన్ని వాతావరణాలలో పెరిగినాపొడి వాతావరణం దీనికి అనుకూలం. పెంచుకునే నేల సారవంతం కాకపోయినా పొడిగా,గుల్లగా ఉండాలి. కుండీలలో చక్కగా పెరుగుతుంది.
నాటేవిధానం :
ఒరెగానో నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. నేలపూర్తిగా తడారిపోయాకనే నీరు పోయాలి.ఎరువులు పెద్దగా అవసరంలేదు. కానీ వర్మీకం పోస్ట్, కంపోస్ట్ కుళ్ళిపోయిన ఆకుల సేంద్రీయ ఎరువును మట్టి మిశ్రమంలో బాగా కలిపి నాటితే మంచిది.దీనికి రసం పీల్చే పురుగులు, బూడిదతెగులు వంటివి ఆశిస్తాయి. వేప కషాయం చల్లడం, వంటసోడాను నీళ్ళలో కలిపి చల్లడం ద్వారా వీటిని నివారించవచ్చు. విత్తనాల ద్వారా, కొమ్మలను లేదా వేర్లను విడదీసి ఒరెగానో మొక్కలను ప్రవర్ధంనం చేయవచ్చు. విత్తనాలు నాటితే ఎనిమిది నుంచి పద్నాలుగు రోజులలో మొలకెత్తు తాయి. విత్తనాలు చాలా చిన్నవి. ఒక గ్రాముకు నాలుగువేల గింజలు వస్తాయి.విత్తనాలు వేసిన ఆరు వారాలకు మొక్కలు తయారవుతాయి.
సువాసన
నాటిన ఆరు వారాల తరువాత చిగుళ్ళు గిల్లివేస్తే మొక్క గుబురుగా పెరుగుతుంది. పూత వచ్చే సమయానికి ఒరెగానో కత్తిరింపుకు సిద్ధంగా ఉంటుంది. దీనినే పెజ్జా ఆకు అని కూడా అంటారు. నర్సరీలలో సాధారణంగా మనం వామాకు అని పిలిచే మొక్కనే ఒరగానో అని అమ్ముతారు కానీ వామాకును క్యూబా ఒరెగానో అంటారు. దీనివాసన థైమ్ కు, ఒరెగానోకు మధ్యస్ధంగా ఉంటుంది. గ్రౌండ్ కవర్ గానూ, రాక్ గార్డెన్ లో పెంచుకుంటే బాగుంటుంది. పొట్టిరకాలు, బంగారు రంగుల ఆకుల మొక్కలు కూడా అందుబాటులోకి వస్తున్నవి. దీనిలో ఎ, సి, ఇ, కె, బి6 వంటి విటమిన్లతో పాలు పోటాషియం, మెగ్నీషియం, ఐరన్ కూడా ఉంటాయి. జలుబూ, దగ్గులకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. టమాటో, మిర్చి వంటి మొక్కలకు కంపానియన్ అంటే ఆ మొక్కలు బాగా పెరిగేందుకు సాయపడతాయి.

బోడెంపూడి శ్రీదేవి (ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్) సౌజన్యంతో...