Pentas, Star Custer ...పెంటాస్ (స్టార్ కస్టర్)
పెంటాస్ (స్టార్ కస్టర్) పూలగుత్తిలా కనువిందుచేసే మొక్క పెంటాస్. దీనినే స్టార్ కస్టర్,ఈజిప్ట్ నక్షత్రాలు అనికూడా అంటారు. ఇది అడుగునుండి రెండడుగుల ఎత్తువరకు పెరిగే బహువార్షిక పొద. నెమ్మదిగాగుబురుగాపెరిగే ఇది ఏడాదంతా పూలు పూస్తూనే ఉంటుంది. దీని ఆకులు స్పష్టంగా కనిపించే ఈనెలతో పచ్చరంగుతో అండాకారంలో నూగుతో ఉంటాయి.నక్షత్రాల్లాంటి చిన్న చిన్న పూలగుత్తుల్లో ఎరుపు, గులాబీ, కలిపి రెండు రంగులలో కనువిందుచేస్తాయి. వీటిని భిన్న రంగుల మొక్కలతో కలిపి నాటుకుంటే మనోహర వర్ణచిత్రంలాక నువిందు చేస్తుంది.
సులభంగాపెరుగుతుంది. :
ఎలాంటి నేలలోనైనా, వాతావరణంలోనైనా సులభంగా పెరిగే మొక్క పెంటాస్. నేరుగా తగిలే సూర్వకాంతిలోనే కాదు కొద్దిపాటి నీడలోనూ చక్కగా పెరుగుతుంది. ఐనా పూలుపూలు ఎక్కువగా పూయాలంటే మట్టి మిశ్రమంలో సారవంతంగా ఉండి నీరునిలవనిదై ఉండాలి. ఏడాదంతా పూలు పూసి మొక్కకు క్రమం తప్పకుండా ఎరువులు అందిస్తే మేలు..నెలకోసారి కొద్దిగా 17:17:17 లేదా 19:19:19 ఎన్ పికె ఉండే సమగ్ర ఎరువును నేలలో కలుపుతూ ఉంటే చక్కగా పెరిగి బాగా పూస్తుంది. దీనికోసం మట్టి మిశ్రమంలో కంపోస్టు కోకోపీట్ తో పాటు కొద్దిగా సూపర్ ఫాస్పేట్ డిఎపి కూడా కలిపి మొక్కను నాటుకోవాలి అపుడపుడు ఆకుల మీద నీళ్ళు చల్లుతూ క్రమం తప్పకుండా నీళ్ళు పోస్తూ ఉంటే ఆకులు, పూలు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఎండిపోయిన పూలను ఎప్పటికప్పుడు తీసేసి, ముదిరిన కొమ్మలను తుంచేస్తే చక్కగా, గుబురుగా పెరిగి విరబూస్తుంది. కొత్తగావచ్చిన పొట్టి రకాలు తక్కువ కాలం బతుకుతాయి. కానిరాశి పోసినట్లు ఉండే పూలతో కనువిందు చేస్తాయి.
చీడపీడలు తక్కువే :
పెంటాస్ కు ఎండసరిగా తగలనప్పుడు బూడిద తెగులు ఆశించవచ్చు. సమస్యను అరికట్టటానికి వంటసోడాను నీళ్ళలో కలిపి చల్లితే ఫలితం ఉంటుంది. అలాగే వేప కషాయం కానుగ కషాయం వంటి వాటితో రసం పీల్చే పురుగులను అరికట్టవచ్చు.మొత్తం మీదచూస్తే పెంటాస్ కు చీడపీడల బెడద తక్కువే. విత్తనాలతోనే కాకుండా కొమ్మ చివరి కత్తిరింపులతోనూ కొత్త మొక్కలను ప్రవర్ధనం చేయవచ్చు. మొక్కలను బోర్డరుగా, బెడ్లలాను, కుండీలలోను క్రమ అమరికలోనూ ఉంచినా చూడముచ్చటగా ఉంటాయి.. ఈ పూలకు తేనెటీగలు,సీతాకోక చిలుకలు,హమ్మింగ్ పిట్టలు ఆకర్షించబడతాయి.
బోడెంపూడి శ్రీదేవి (ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్) సౌజన్యంతో...