header

Roses...గులాబీలు

Roses...గులాబీలు
marigold plants గులాబీ రకాలలో సువాసనకు పేరొందినవి డమాస్కస్ గులాబీలు. వీటిని గులాబీ నూనె, రోజ్ వాటర్, గుల్కండ్ వంటివి తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. హెర్బల్ టీలలోనూ వాడతారు. డమాస్కస్ గులాబీలలో జ్వాల, హిమ్రోజ్, హాట్ హిమ్రోజ్ వంటి హైబ్రీడ్ రకాలు ఉన్నాయి. ఈ గులాబీలు చూడడానికి అందంగా ఉంటాయి. చాలా పరిమళాన్ని ఇస్తాయి. ఔషధ గుణాలు కూడా ఎక్కువే.
సువాసనతో కూడిన హైబ్రీడ్ టీ గులాబీలూ అందుబాటులోకి వచ్చాయి. వాటీలో ముఖ్యమైనవి షర్బత్, రక్తిమా, అనురాగ్, జవహర్, నూర్జహాన్, రాజహంస, కనకాంజి రకాలు విరివిగా లభిస్తున్నాయి. సుగంధ రకాల గులాబీ మొక్కలు. మామూలు వాటికంటే కొంచెం పెద్దగా పొదలా పెరుగుతాయి. డమాస్క్ రకం లేత గులాబీ, లేత ఎరుపు రంగులలోనే లభిస్తాయి. మిగిలిన హైబ్రీడ్ రకాలు వివిధ రంగులలో లభిస్తాయి.
ఏటా రెండుసార్లు : సుగంధ గులాబీలకు కూడాసాధారణ గులాబీలలాగేనే ఎక్కువ వెలుతురు, సారవంతమైన నేలా అవసరం పూర్తిగా నేల పొడిబారాకే నీరు పెడితే సరిపోతుంది. ఎరువులు ఎక్కువగా వేయవలసి ఉంటుంది. సూక్ష్మ పోషక ఎరువులను తరచూ వేస్తూ మొక్క ఆరోగ్యంగా పెరిగేలా చూసుకోవాలి. గులాబీ మొక్కలను ఎక్కువగా పెంచేవారు రోజ్ మిక్స్ ఎరువుని తయారు చేసుకుని వాడితే మంచిది. చవకగా కూడా తయారవుతుంది. వేప కషాయం చల్లడం, మట్టిలో జీవరసాయనాల ఎరువులను కలపడం ద్వారా చీడపీడల నుంచి రక్షణ పొందవచ్చు. ఇతర గులాబీ మొక్కలలాగానే సుగంధ గులాబీ మొక్కలను కూడా ఏప్రియల్, అక్టోబర్ నెలలలో ప్రూనింగ్ చేసుకోవాలి. ఎండిపోయిన కొమ్మలనూ, పూలనూ ప్పటికప్పుడు తీసివేయాలి. డమాస్కస్ రకమైతే ముదురు కొమ్మలను నాటడం ద్వారా ... హైబ్రీడ్ రకాలను బడ్డింగ్ ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు

బోడెంపూడి శ్రీదేవి (ల్యాండ్ స్కేప్ కన్సల్టెంట్) సౌజన్యంతో...