header

Sanku Poolu

శంఘుపూల చెట్టు

sankupooluసీతాకోక చిలుక చెట్టు శంఘుపూల చెట్టు దాదాపు ఐదు నుంచి ఆరు మీటర్ల ఎత్తువరకు పెరగగలదు. దీని పూలు శంఖుపూల మాదిరిగానే ఉన్నా ఇంకా అందంగా, పెద్దగా ఊదారంగులో ఉంటాయి. దీని ఆకులు పెద్దగా అండాకారంలో, ముదురాకు పచ్చ రంగులో మెరూస్తూ కనువిందు చేస్తాయి. పూలతో ఉన్నప్పుడు అద్భుతంగా కనిపించే ఈ చెట్టు పూలు లేనప్పుడు కూడా పచ్చగా ఉండి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. గొడుగు ఆకృతిలో ... శంఖుపూల చెట్టు వేగంగా పెరుగుతుంది. కొద్దిగా సాగినట్లుండే కొమ్మలతో పెరిగే ఈ చెట్లు మొదట్లో తీగలా భ్రమింపచేసినా కొద్దికాలంలోనే చెట్టు రూపం సంతరించుకొంటుంది. గొడుగు ఆకారంలో పరుచుకున్నట్లు ఉండే కొమ్మలతో నిండుగా కనిపిస్తుంది. నీడనిచ్చే ఈ చెట్టును కొద్దిగా తోటకు ఒకమూల నాటుకుంటే దీని కింద కూర్చుని చక్కగా ప్రకృతిని ఆస్వాదించవచ్చు. శ్రద్ధ పెట్టాలిలా... సారవంతమైన నీరు నిలవని నేలల్లో ఈ చెట్టు బాగా పెరుగుతుంది. అన్న వాతావరణాల్లోనూ పెరిగినా మరీ పొడి వాతావరణం దీనికి అంతగా పనికిరాదు. శంఖు పూల చెట్టు పూర్తి సూర్యకాంతిలో చక్కగా పెరుగుతుంది. ఎండ మరీ విపరీతంగా ఉంటే మొక్క చుట్టూ ఉండే వాతావరణంలో నీళ్ళు స్ప్రే చేసి చల్లగా ఉంచగలిగితే బాగుంటుంది. శంఖుపూల చెట్టుకు చీడపీడలు పెద్దగా ఆశించవు. అప్పుడప్పుడు వేపనూనె పిచికారీ చేస్తే సరిపోతుంది.వర్షాకాలం నుంచి శీతాకాలం వరకూ నెలకోసారి వర్మీకం పోస్టు, ఎన్ పీ కె ఉండే సమగ్ర ఎరువును వేస్తూ ఉండాలి. ఇలా చేస్తుంటే దాదాపు డిసెంబర్ వరకూ చక్కగా పూస్తుంది. శంఖుపూల చెట్టును కొమ్మలతో ప్రవర్ధనం చేయవచ్చు. బెంగుళూరులోని లాల్ బాగ్ గార్డెన్స్ లో ఉన్న చెట్టును చూస్తే ఎవరైనా ప్రేమలో పడితీరాల్సిందే.
---బోడెంపూడి శ్రీదేవి, లాండ్ స్కేప్ కన్సల్టెంట్.....సౌజన్యంతో....