header

Jack Fruits

పనస

తియ్యగా ఉండే పనస తొనలు శరీరానికి పుష్టినిస్తాయి. తేమ, పిండి పదార్ధాలు, కొవ్వు, ఇనుము, విటమిన్ సి, ఎ లు కలిగి ఉంటాయి. రక్తపోటు అధికంగా ఉన్నవారు పొటాషియం అధికమోతాదులో లభించే పనసను తీసుకుంటే సమస్య తీవ్రతను తగ్గించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఈ పండులో లభించే ఫైటో నూట్రియంట్ లు క్యాన్సర్ రాకుండా మరియు హైపర్ టెన్షన్ తగ్గంచడంలో సహాయపడతాయి.
పోషకాలు..
రోజుకి 30 గ్రా పచ్చి పనసని ఆహారంలో చేర్చుకుంటే బరువు తగ్గడంతోపాటు రోజంతా హుషారుగా ఉండటం, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకోవడం తేలికవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
కొలెస్ట్రాల్‌ లేకపోవడం, సంతృప్త కొవ్వులు తక్కువగా ఉండటంతో బరువు తగ్గాలనుకునే వారిని ఈ వంటకాలు ఆకర్షిస్తున్నాయి. ఒక కప్పు అన్నం, గోధుమల నుంచి అందే పోషకాలన్నీ 30 గ్రా పనస నుంచి సులభంగా అందుకోవచ్చట.
రోగనిరోధకశక్తిని పెంచే గుణం పనసకి ఉంది. దీనిలో పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. థైరాయిడ్‌ పనితీరుని మెరుగుపరుస్తుంది.
క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముక సాంద్రత పెరిగి, ఎముకలు గుల్లబారడం వంటి సమస్యల ముప్పు తగ్గుతుంది. ఉబ్బసం ఉన్నవారికీ ఉపశమనం కలిగిస్తుంది. ఫ్రీరాడికల్స్‌ని నిరోధించి ముఖంలో వయసుపైబడుతున్న లక్షణాలని కనిపించనీయకుండా చేస్తుంది. పీచు కారణంగా జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది.