header

Apricots…….ఆప్రికాట్స్......

Apricots…….ఆప్రికాట్స్......

ఈ పండ్లు లేత పసుపు రంగులో ఉండి కొద్దిగా పుల్లగా తీయగా ఉంటాయు. చిన్న ఆకారంలో ఒకే గట్టి విత్తనం కలిగి ఉంటాయి.
ఆప్రికాట్స్ లో పీచు పుష్కలంగా ఉంటుంది. ఎ,సి,కె, ఇ విటమిన్లు ఈ పండ్లలో ఉంటాయి. కాపర్, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్ మరియు నియాసిన్ వంటి ఖనిజాలు ఉన్నాయి. ఆప్రికట్స్ పచ్చికాయలు మరియు ఎండుకాయలుగా లభిస్తాయి. కొలస్ట్రాల్ తగ్గుతుంది. శారీరక బరువు తగ్గుతుంది. వీటితో రసాలు, జెల్లీలు, జామ్ లు చేస్తాయి. ఆప్రికాట్స్ లో పీచు ఎక్కువగా ఉండటం వలన మలబద్దకానికి చక్కగా పనిచేస్తాయి.
ఆప్రికాట్స్ లో విటమిన్ – ఎ పుష్కలంగా ఉండటం వలన కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆప్రికాట్స్ లోని పీచు మంచి కొలస్ట్రాల్ ను పెంచి చెడు కొలస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీని వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
కాపర్, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్ మరియు నియాసిన్ వంటి ఖనిజాలు ఉండటం వలన ఎముకలు బలపడతాయి. వీటిలో ఇనుము సమృద్ధిగా ఉండటం వలన రక్తంలోని ఎర్రరక్త కణాలు పెరుగుతాయి. శరీర మెటబాలిజం వృద్ధి చెందుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇవి తినటం వలన బరువు తగ్గుతారు.
మిగతా ఎండుఫలాలు (డ్రై ఫ్రూట్స్) ల కంటే ఈ పండ్లలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. వీటి ఉనికి ఆర్మేనియా దేశంలో కనుగొనబడి తరువాత ప్రపంచమంతా వ్యాపించియి. ఈ పండ్లలో ఉన్న రసాయనాలు రక్తంలో ఉన్న చక్కెరలను అదుపులో పెట్టటం వలన మధుమేహం నియంత్రణలో ఉంటుంది. కనుక డయాబెటిక్ పెషంట్లు నిరభ్యరంతంగా ఈ పండ్లను తినవచ్చు.