అరటిపండ్లు తినటం వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. డిప్రెషన్ తగ్గుతుంది. మార్నింగ్ సిక్ నెస్ నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ పండ్లలో విటమిన్ సి, బి6 ఎక్కువగా ఉండటం వలన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. అరటిపండ్లలొ అధిక పొటాషియం ఉండటం వలన పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
ఒక మీడియం సైజ్ అరటిపండులో 110 క్యాలరీలు, 30 గ్రాములు కార్బోహైడ్రేట్స్, ఒక గ్రాము ప్రొటీన్ లు ఉంటాయి. ఫ్యాట్ కానీ, కొలస్ట్రాల్ గానీ, సోడియం గానీ అరటిపండులో ఉండవు.
అరటిపండులో పొటాషియమ్ పుష్కలంగా ఉంటుంది. పిలల్లకు రోజూ ఒక అరటిపండు తినిపిస్తే ఆస్తమా వచ్చే అవకాశం తగ్గుతుందని అండన్ కు చెందిన ఇంపీరియల్ కాలేజ్ నిపుణులు తెలిపారు.
ఒక మధ్యస్తంగా ఉండే అరటిపండులో మూడు గ్రాముల పీచు ఉంటుంది. డయాబెటీస్ వారు కూడా ఎక్కువగా కాకుండా మధ్యస్తంగా ఉండే అరటిపండును పూర్తిగా మగ్గినది కాకుండా కొద్దిగా గట్టి కాయను తినవచ్చు. పచ్చి అరటిపండ్లలో జీర్ణంకాని పిండిపదార్ధాల శాతం ఎక్కువ. దీంతో ఇవి ఇన్సులిన్ అవసరాన్ని తగ్గించడం ద్వారా మధుమేహవ్యాధి తగ్గేందుకు దోహదపడతాయని అంటారు.
రక్తహీనత గలవారికి అరటిపండు మంచి ఆహారం. ఇందులో ఐరన్ ఉండటం వలన హిమోగ్లోబిన్ పెరగటానికి దోహదం అవుతుంది. గట్టిగా ఉన్న అరటిపండ్లలో పెకిటన్ పీచుతోపాటు త్వరగా కరగని పిండిపదార్ధాల శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి తినటం వలన పొట్టనిండుగా ఉంటుంది. ఫలితంగా ఆకలి బాగా తగ్గుతుంది. అమెరికాలో ఎక్కువగా పండే యాపిల్స్, కమలాల కన్నా అమెరికన్లు అరటిపండ్లనే ఎక్కువగా తింటారు.
అందరికీ ముఖ్యంగా చిన్న పిల్లలకు, విద్యార్థులకు మంచి ఆహారం అరటిపండ్లు. పిల్లలకు పిజ్జాలు, న్యూడిల్స్, లేస్, చిప్స్ బదులు ఆరోగ్యకరమైన అరటిపండ్లు ఆహారంగా ఇవ్వండి.