header

Canberries

 graviola fruitsవాక్కాయలు (కాన్ బెర్రీస్)

వాక్కాయలు (కాన్ బెర్రీస్) కాన్ బెర్రీలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయని జర్మనీ లోని డ్యుసెల్ డోర్స్ యూనివర్శిటీ అధ్యయన కారుడు అనా రోడ్రిగ్స్ తెలిపారు.
వాక్కాయల రసంలో ఫైటో న్యూట్రియంట్స్, అంథోసైనిన్స్, ఫినోలిక్ యాసిడ్స్, అధికంగా ఉన్నాయి. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్ పాలిఫినల్స్ వనల కణాలు దెబ్బతినకుండా ఇన్ఫెక్షన్లకు గురవకుండా రక్షిస్తుంది.
18-40 సం. రాల వయసున్న 10మంది ఆరోగ్యవంతులపై చేసిన పరీక్షలలో రక్తనాళాలలోని రక్తప్రసారం ఎటువంటి ఆటంకాలు లేకండా సాఫీగా ఉందని, హృద్రోగ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పట్టినట్లు తేలింది.
నీటితో కలిపిన వాక్కాయల రసంలో పాలిఫినాల్స అధికసంఖ్యలో ఉన్నట్లు వెల్లడైంది. వాక్కాయల రసం తీసుకున్న వారికి అధిలోస్కాలోరోసిస్ వ్యాధి తగ్గుముఖం పట్టింది. హార్మోన్ల విడుదల మూత్రపిండాల పనివిధానంలో వాక్కాయలు రసం ప్రధాన పాత్ర వహించింది. గుండెకు సంబంధించిన సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ లో మెరుగుదల కనిపించింది.
ప్రతిరోజూ వాక్కాయల రసం తీసుకోవటం వలన ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారించగలదు. దంతాలు పుచ్చిపోకుండా నుండి నోటి దుర్వాసన నుంచి కాపాడుతుంది. మెదడు సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడటంతో పాటు పెప్టిక్ అల్సర్, పొట్టనొప్పిని నివారిస్తుంది.
విటమిన్ సి అధికంగా ఉండటం కారణంగా స్కర్వీ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. రోజూ వీటి రసం తాగటం వలన గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.