కొబ్బరి నీరు
ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన పానీయం కొబ్బరి బోండాం నీళ్ళు. కొబ్బరి నీళ్ళలో కొవ్వు లేదు. మనకు అవసరమైన అన్నిరకాల ఖనిజాలు ఉన్నాయి. కొబ్బరి బోండాం లోపల స్వచ్ఛమైన కొబ్బరి నీళ్ళలో ఫైటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైములు మరియు చక్కెరలు ఉన్నాయి.
శారీరక శ్రమ చేయటం వలన కోల్పోయిన ఖనిజాలను కొబ్బరినీరు తాగటం వలన భర్తీ చేసుకోవచ్చు. డీ హైడ్రేషన్ వలన శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి అందించడంలో కొబ్బరి నీరు ఎంతగానో సహాయం చేస్తాయి. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోడ్స్, చక్కెరల వలన ఇది సాధ్యపడుతుంది.
కొబ్బరి నీళ్ళు జీవన క్రియలు సరిగా జరగటానికి సహాయం చేస్తాయి. కొబ్బరి నీరులో వున్న బయోయాక్టివ్ ఎంజైమ్ మన జీవన క్రియలను వేగవంతం చేస్తుంది. అరుగుదల శక్తిని మెరుగు పరుస్తుంది.
పొటాషియం తక్కువ అవటం వలన కండరాలు తిమ్మిరెక్కటం, మొద్దుబారటం, అగే కండరాలు ఈడ్చుకుపోవటం జరుగుతుంది. కొబ్బరి నీరు తాగటం వలన ఇలాంటి ఇబ్బందుల నుండి ఉపశమనం కలుగుతుంది.