సీతాఫలం
సీతాఫలం యొక్కతీయని గుజ్జు అమృతాన్ని తలపిస్తుంది. అరిస్టోక్రాట్ ఆఫ్ ఫ్రూట్స్ గాపేరొందిన పండే సీతాఫలం.
వీటిలో లక్ష్మణ ఫలం, హనుమాన్ ఫలం, రామాఫలం అనేరకాలున్నాయి. లక్షణఫలం ముళ్ళతొక్కతో ఉండి పులుపుతో కూడిన తియ్యని రుచి కలిగి ఉంటాయి. కానీ సీతాఫలాలే ఎక్కువ అందుబాటులో ఉంటాయి. సీతాఫలాలో పోషకాలు ఎక్కువే.
వంద గ్రాముల సీతాఫలంలో 94 క్యాలరీలు ఉంటాయి. తక్కువ బరువు కలవారు ఆరోగ్యంగా బరువు పెగాలంటే సీతాఫలాలు ఉపకరిస్తాయి. నీరసంగా ఉన్నపుడు ఓ సీతాఫలం తింటే వెంటనే నీరసం పోతుంది.
సీతాఫలాలలో అధికంగా ఉండే విటమిన్ –సి సహజ యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
కణజాలబలహీనతలను, ఆస్తమాను తగ్గిస్తుంది.
ఈ పండులో ఉండే ఆల్కలాయిడ్లు సిటోజెనిన్లు క్యాన్సర్ సంబంధిత, మూత్రపిండాల వ్యాధులు రాకుండా కాపాడతాయి.
సీతాఫలాలోని పీచు కాలేయ,పేగువ్యాధుల నుంచి కాపాడుతుంది. జీర్ణప్రక్రియకు ఎంతో మంచిది.
సీతాఫలాలలో అధికంగా ఉండే బి-విటమిన్, మెదడులో విడుదలయ్యే గాబా న్యూరాన్ అనే రసాయనాన్ని తగ్గిస్తుందని అంటారు. ఫలితంగా ఒత్తిడి, డిప్రెషన్, చికాకు వంటివి తగ్గుతాయి.
సీతాఫలాలలో అధికంగా ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది.
వీటిల్లోని రిబోఫ్లేవిన్, విటమిన్-సి లు కంటిచూపుని మెరుగుపరుస్తాయి. గర్భస్త శిశువు చర్మం, కళ్ళ, జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి.
ఈ పండుని పటికబెల్లంతో కలిపి తింటే పాలిచ్చే తల్లులకు పాలు బాగా పడతాయి. పొటాషియం బి.పిని తగ్గిస్తుంది. ఈ పండులోని నియోసిన్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. సీతాఫలాలలో ఉండే కాపర్, థైరాక్సిన్, హార్మోన్ ఉత్తత్తికి ఎంతో అవసరం. ఇది జట్టును తెల్లబడకుండా కాపాడుతుంది. గర్భిణులకు కాపర్ ఎంతో అవసరం. నెలలు నిండకుండా ప్రసవించటాన్ని తగ్గిస్తుంది.
ఈ పండ్లలో ఫోలేట్ (బి-9)గర్భిణులకు ఎంతో మంచిది. వేవిళ్ళతో బాధపడేవారు తింటే వికారం తగ్గుతుంది.
ఈనాడు ఆదివారం – (11-10-15) సౌజన్యంతో...