ఆల్ బుఖేరా (ఫ్లమ్) పెద్దసైజ్ చెర్రీలలాగా తీపి, పులుపు రుచులు కలిగి వుంటాయి. పక్యానికి వచ్చిన దశలో వీటిపైన సహజంగా తెల్లని మైనపు పూత ఏర్పడుతుంది. తుడిస్తే పోతుంది. పీచు ఎక్కువగా ఉండే ఈ పండ్లవలన జీర్ణక్రియ బాగా జరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నాడీకణాల తీరును మెరుగుపరుస్తాయి. వీటిలో ఇనుము శాతం ఎక్కువ. రక్తప్రసారం మెరుగై హృద్రోగ సమస్యలు రాకుండా ఉంటాయి.
రోజూ తినటం వలన కంటినరాల క్షీణత రాకుండా ఉంటుంది. వీటిలోని విటమిన్ సి ఆస్తమాచ ఆస్టియో ఆర్ధ్రరైటిస్, కోలన్ క్యాన్సర్, రుమటాయిడ్లు రాకుండా నిరోధిస్తాయని అంటారు.