పంపరపనస, నారింజ పండ్ల మధ్య సహజంగా జరిగిన సంకరీకణ ద్వారా పుట్టినదే దబ్బపండు. ఒకలాంటి వగరుతో కూడిన తీపి పులుపూ రుచులతో ఉంటుంది. మన దగ్గర దొరికే దబ్బపండు మన నారింజలోని పులుపుతోనూ పంపరపనస పరిమాణంలోనూ టుంది. నారింజ, నిమ్మ పంపరపనసలలోని గుణాలన్నిటినీ పుణికి పుచ్చుకున్నదే దబ్బపండు
ప్రయోజనాలు:
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ. అందుకే ఆరోగ్యానికి మంచిది.
వంద గ్రాముల గుజ్జులో 42 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కానీ పీచుశాతం చాలా ఎక్కువ. పీచు క్యాన్సర్ కారణమైన రసాయనాల్ని పీల్చేస్తుంది. ఇంకా కొలస్ర్టాల్ తగ్గేందుకు సహకరిస్తుంది.
ఇందులో విటమిన్-ఎ సమృద్ధిగా నారింజనిన్, నిరంజిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఊపరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి. లైకోపిన్, బీటా కెరోటిన్, క్సాంథిన్, ల్యూటిన్ వంటి ఫ్లేవనాయిడ్లూ ఎక్కువే. అందుకే దబ్బపండును క్రమం తప్పకుండా తీసుకోవడం వలన కంటిచూపు మెరుగుపడుతుంది.
సి విటమిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. సహజమైన యాంటీ ఆక్సిడెంట్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. . 100 గ్రాముల తాజా పండులో 135 మి.గ్రాముల పొటాషియం ఉంటుంది. గుండె వేగాన్ని నియంత్రించేందుకు రక్తపోటు అదుపునకూ ఇది ఎంతో ఉపయోగం. ఎరుపు రంగులో ఉండే గ్రేప్ ఫ్రూట్లో లికోపిన్ ఉండటం వల్ల ఇది చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడటంతోబాటు ప్రోస్టేట్ క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. ఇతర కెరోటినాయిడ్లతో పోలిస్తే క్యాన్సర్ కారక ఫ్రీరాడికల్స్ తో పోరాడే శక్తి లైకోపీన్ ఎక్కువ. లియోనాయిడ్ల గ్లూకారేట్లూ కూడా ఇందులో ఎక్కువ. ఇవి రొమ్ము క్యాన్సర్లూ ట్యూమర్లూ రాకుండా కాపాడతాయి. ఇందులోని నారింజనిన్ అనే ఫ్లేవొనాయిడ్ దెబ్బతిన్న డి ఎన్ ఎను సైతం బాగుచేస్తుంది. ఇందులో కాల్షియం, ఐరన్, కాపర్ ఫాస్ఫరస్ వంటి ఖనిజాలతోపాటు కొద్దిపాళ్ళలో బి-కాంప్లెక్స్ కూడా ఉంటాయి. ఇది ఊబకాయాన్ని నివారించేందుకు దోహదపడుతుందని పరిశోధకులు నర్థారించారు.
ఇది మంచి క్లీన్సర్ కూడా దీని గుజ్జుని చర్మం మీద రుద్దితే మృతకణాలను తొలగించి నిగారింపుని తీసుకొస్తుంది. ఖరీదైన ఫేస్ క్రీములను గమనిస్తే వాటిల్లో హైడ్రాక్సీ ఆమ్లాలుంటాయి. అవన్నీ సహజంగానే దబ్బపండులో ఉంటాయి. ఇంటిని శుభ్రపరచేందుకు అధ్భుతంగా పనికొస్తుంది. మూడొంతుల వేడినీళ్ళలో ఒక వంతు వినెగర్ను, ఒకవంతు దబ్బపండు రసాన్ని కలిపితే చాలు బాత్రూమ్, టబ్లూ సింక్స్, కిచెన్, టైల్స్ అన్నీ శుభ్రం చేసుకోవచ్చు.
అన్నింటికన్నా ముఖ్యంగా వయసును పైబడనివ్వదని పరిశోధనలలో తేలింది. దీనిని భోజనం తరువాతే తీసుకోవాలి గానీ పరగడుపునే వద్దని అదీ నిత్యం మందులు వాడేవారు వాటితో కలిపి తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఏ సిట్రస్ పండయినా భోజనానికీ భోజనానికి మధ్యలో తీసుకోవటమే మంచిది.