చూడచక్కని ఆకృతితో నిండా గుజ్జుతో నోరూరించే రుచితో ఆకర్షిస్తుంది లక్ష్మణఫలం. మన దగ్గర విరివిగా పెరిగే ఈ మొక్కను ఆంటి పెరట్లో నాటుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలకు పరిష్కారం
లభించినట్లే.. అంటున్నాయి పలు అధ్యయనాలు...
లక్ష్మణ ఫలాన్ని గ్రావియోలా అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం అనోవా ముయరికేటా. ఇది ఉష్ణ మండలానికి చెందింది. ఇరవై ఐదు నుంచి ముఫ్పై అడుగుల ఎత్తు వరకూ పెరిగే పొదలాంటి చిన్న సతతహరిత వృక్షం ఇది. దీని ఆకులు సీతాఫలం ఆకుల్లాగే ఉన్నా
కొంచెం పెద్దగా ఉంటాయి. లక్ష్మణఫలం ఇసుక నేలలలో బాగా పెరుగుతుంది అన్ని నేలలోనూ పెంచుకోవచ్చు అయితే నీరు నిలవకూడదు. మట్టి మిశ్రమంలో కంపోస్టు, వర్మీకం పోస్టు, వేపపిండి, ఇసుక వంటివి కలిపి మొక్క ఆరోగ్యంగా దిగేలా చూసుకోవాలి. దీనికి క్రమం
తప్పకుండా నీళ్ళుపోయడం అవసరం.
పండ్లు తియ్యగా ఉంటాయి
లక్ష్మణ ఫలాన్ని సాధారణంగా గింజలు నాటి ప్రవర్ధనం చేస్తారు. కొమ్మ కత్తిరింపులూ, అంటుకట్టడం, బడ్డింగ్ వంటి పద్దతులను అందుకు ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల నాణ్యమైన మొక్కలు తయారవుతాయి. విత్తనాలను నాటేటపుడు శ్రభంగా కడిగి, కోకోపీట్ వర్మీకం పోస్ట్,
ఇసుక కలగలిసిన మిశ్రమంలో దీనిని నాటుకోవాలి. మొలకలు రావడానికి కనీసం పదిహేను నుండి ఇరవైరోజుల సమయం పడుతుంది. దాదాపు అడుగు ఎత్తు పెరిగిన తరువాత కావల్సిన ప్రదేశం అనగా కుండీలో గానీ, నైలపై అనువైన ప్రదేశంలో గానీ సారవంతమైన మట్టి మిశ్రమం
నింపి నాటుకోవాలి. వాడేసిన కాఫీ పొడి, టీ పొడి ఈ మొక్కకు వేస్తే మంచిది. త్వరగా పెరుగుతుంది. నాటిన మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాలలోపు కాపుకొస్తుంది. దీని కాయలు కోడిగుడ్డు లేదా హృదయాకారంలో, తొక్కమీద మొత్తని ముళ్ళతో ఉంటాయి.
ముదురాకుపచ్చ నుంచి పసుపు కలిపిన లేత పచ్చరంగుకి మారినపుడు పండ్లను కోయాలి. ఇవి మంచి సువాసనతో తక్కువ గింజలతో మొత్తని గుజ్జుతో మధురంగా ఉంటాయి.
ఉష్ణోగ్రత ఎక్కువవైనా గాలిలో తేమ తక్కువైనా కాపు తగ్గుతుంది. లక్ష్మణఫలానికి ఎరువులు క్రమం తప్పకుండా వేస్తుంటే ఆరోగ్యంగా పెరుగుతుంది. 17:17:17 శాతం చొప్పున సమగ్ర ఎరువును 50-100 గ్రాముల చొప్పున నెలకోసారి వేస్తే మంచిది. నాటిన రెండో సంవత్సరంలో
రెండు రెట్లు మూడో సంవత్సరంలో మూడు రెట్లు చొప్పున పెంచి వేయాలి. పండుకి ఈగలు నష్టం కలిగించకుండా తరచూ వేపకషాయం చల్లతూ ఉండాలి. ఎండిపోయిన కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. ఈ లక్ష్మణ ఫలంలో పోషకాలు అధికం పిండిపదార్ధాలు, మాంకృత్తులతో పాటూ
క్యాల్షియం, ఇనుమూ, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు, సి, ఎ, బి1, బి2 వంటి విటమిన్లూ అధికంగా ఉంటాయి.
ఔషధపరంగా....దొక అద్భుతమైన ఫలం. ప్రపంచవ్యాప్తంగా దీనిని ఇప్పుడు క్యాన్సర్ కు ఔషధంగా వాడుతున్నారు. కీమో థెరపీతో తలెత్తే అనర్ధాలేవి దీనివల్ల ఉండవు. అనేక వ్యాధులూ, అధిక రక్తపోటు, మలబద్ధకం, పార్శ్వపు నొప్పి, మధుమేహం, మూత్రకోశ వ్యాధులవంటి
వాటికి లక్షణ ఫలాన్ని ఔషధంగా వాడుతున్నారు. దీని ఆకులు కీళ్ళ నొప్పులను వాపులను తగ్గించటానికి పనికి వస్తాయని అంటారు. దీని గింజలను పొడిచేసి నీళ్ళలో కలిపి రాస్తే కండరాలు పట్టేయటం తగ్గుతుంది. పండ్లను బాలింతలు తింటే పాలు వృద్ధి చెందుతాయి.
వీటిల్లోని ట్రిఫ్టోపాన్ వలన ప్రపశాంతత కలిగి, నిద్రలేమి సమస్య దూరమవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.