header

Guava Fruit….జామకాయ

జామకాయ ఆరోగ్యానికి మంచిదన్నది తెలిసిందే. కానీ అందులో మహత్తరమైన ఔషధగుణాలూ ఉన్నాయి అంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా అందులో అధికంగా ఉండే ఆస్ట్రిజెంట్స్, ప్రొస్టేట్, రొమ్ము క్యాన్సర్ల నిరోధానికి తోడ్పడతాయని తాజా పరిశోధనల్లో తేలింది. అంతేకాదు, ఇవి డయేరియాకీ మందులా పనిచేస్తాయి. ఈ ఆస్ట్రిజెంట్లు పండిన జామలోకన్నా పచ్చి జామలో ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మసౌందర్యాన్నీ పెంపొందిస్తాయి. ఆ కారణంతోనే ఇటీవల జామతో అనేక టోనర్లూ క్రీములూ వంటి రకరకాల సౌందర్యోత్పత్తుల్ని తయారుచేస్తున్నారు.
సిట్రస్ జాతి పండ్లలోకన్నా జామలో సి-విటమిన్ నాలుగు నుంచి పది రెట్లు ఎక్కువ. అందువల్ల ఇది అద్భుతమైన యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఇందులోని కాపర్, థైరాయిడ్ గ్రంథి పనితీరుని క్రమబద్ధీకరిస్తుంది. జామలోని బి3, బి6 విటమిన్లు మెదడు, నరాల పనితీరునీ ప్రభావితం చేస్తాయి. ఈ కాయలు మూర్ఛ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకీ మందులా పనిచేస్తాయి.
గులాబీ, ఎరుపు రంగు జామలో లైకోపీన్ టొమాటోల్లోకన్నా రెట్టింపు ఉంటుంది. ఇది జీవక్రియావేగానికీ పర్యావరణ కాలుష్యం నుంచి శరీరాన్ని కాపాడేందుకూ దోహదపడుతుంది.
అధికంగా ఉండే పీచు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ల కారణంగా జామ మధుమేహులకి ఎంతో మేలు. వీటిల్లోని ఎలక్ట్రోలైట్ల కారణంగా ఇది బీపీ, హృద్రోగాలతో బాధపడేవాళ్లకీ ఎంతో మంచిది. జామలోని ఫోలిక్ ఆమ్లం గర్భిణులకీ మేలే. ఇంకా ఇందులోని విటమిన్-ఎ, కంటిచూపునీ మెరుగుపరుస్తుంది.
తరచూ జలుబూదగ్గులతో బాధపడేవాళ్లు జామకాయను తినడంవల్ల ఆయా ఇన్ఫెక్షన్లూ తగ్గుతాయి.
పంటినొప్పికీ వాపులకీ జామాకు మంచి ఔషధం. దీన్ని నూరి గాయాలూ పుండ్లకి రాసినా వెంటనే తగ్గుముఖం పడతాయి
తలనొప్పి, మైగ్రెయిన్‌లతో బాధపడేవాళ్లు పచ్చిజామను ముద్దలా నూరి, రోజుకి మూడునాలుగుసార్లు నుదుటిమీద పెట్టుకుంటే ఆ నొప్పి తగ్గుతుందట.
తీవ్రమైన జలుబుతో సతమత మవుతుంటే కాస్త పెద్ద సైజు జామకాయను తీసుకుని అందులోని గింజలు తీసేసి తినాలి. ఆ తరవాత ఓ గ్లాసు నీళ్లు తాగేస్తే అది మంచి మందులా పనిచేసి గొంతులోనూ వూపిరితిత్తుల్లోని కఫాన్ని తగ్గిస్తుందట.
గుండె బలహీనంగా ఉన్నవాళ్లూ హృద్రోగ సమస్యలతో బాధపడేవాళ్లూ జామకాయలోని గింజలు తీసేసి ముక్కలుగా కోసి వాటికి కాస్త పంచదార చేర్చి మీడియం మంటమీద మెత్తగా ఉడికించి, రోజుకి రెండుసార్లు తింటే ఎంతో మంచిది. ఇది మలబద్ధకాన్నీ నివారిస్తుంది.
జామకాయల్లోని విటమిన్‌ బి3, బి6 మెదడుకి రక్తసరఫరాని పెంచి, దాని పనితీరుని మెరుగుపరుస్తాయి. ఇందులో కొద్దిపాళ్లలో ఉండే కాపర్‌ థైరాయిడ్‌ సమస్యల్ని తగ్గిస్తుంది. జామలోని పీచు కారణంగా మధుమేహ రోగులకి మంచి ఆహారం.
జామకాయల్లోని ఆస్ట్రింజెంట్‌ గుణాలు చర్మంమీద ఎలాంటి మచ్చలూ లేకుండా మెరిసేలా చేస్తాయి. ముడుతలు పడకుండానూ చూస్తాయి. అందుకే ఇది వృద్ధాప్యాన్నీ దరిచేరనీయదని అంటారు.
ఆర్థ్రయిటిస్‌ బాధపడేవాళ్లకి జామ ఆకుల్ని నూరి నొప్పి వచ్చిన చోట పెడితే చాలావరకూ తగ్గుతుంది. మూర్ఛ రోగులకి జామఆకుల రసంతో వెన్నెముక మీద మసాజ్‌ చేస్తే అవి రావడం తగ్గుతుందట. పంటి నొప్పికి జామ ఆకుల రసం మంచి ఔషధం.
జామపండు ఉష్ణమండల ప్రాంతమైన ఆసియా దేశాలలో పండుతుంది. ఆకుపచ్చ రంగులో ఉండి పండిన తరువాత లేత పసుపు పచ్చ రంగులోకి మారుతుంది.. లోపలి కండభాగం తెల్లరంగు, గులాబీ రంగులో కానీ, ఎరుపు రంగులో కానీ ఉంటుంది. జామకాయలో గింజలు సన్నగా తక్కువగా ఉండి, కండభాగం ఎక్కువగా ఉన్నవి రుచిగా ఉంటాయి
జామకాయ/పండుతో ప్రయోజనాలు : జామకాయలో విటమిన్ లు, పీచు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. పురుషులలో వీర్వకణాలు నెమ్మదిగా చలించటం, నిలిచి పోవటం, ఒకదానికి ఒకటి అతుక్కుపోవటం వంటి కారణాల వల్ల వచ్చే వంధ్యత్వం దూరం చేయటానికి జామకాయలలో బాగా ఉన్న విటమిన్‌ సి ఎంతో ఉపయోగ పడుతుంది.
శరీరం బయట తగిలే గాయాలను,పుండ్లను నయం చేయటానికి జామకాయ గుజ్జు ఎంతో ఉపయోగం, ముక్కు నుండి రక్తం కారటం లాంటివి జామపండు వలన తగ్గతాయి. దీనిలో రక్తం గడ్డ కట్టించే గుణం ఉంది. పేగుల్లో అధికంగా ఉన్న మ్యూకస్‌ పొరను తొలగించి రక్తవిరేచనాలను తగ్గిస్తుంది. జీవ ప్రక్రియలో జనించే స్వేచ్ఛాకణాలతో పోరాడి వయసుతో పాటు వచ్చే అల్జీమర్స్‌ వ్యాధి, శుక్లాలు, కీళ్లవాపులు రాకుండా ఆపుతుంది. మలబద్ధకంతో బాధపడే వారికి, జామకాయలోని ఎక్కువగా ఉన్న పీచుపదార్థాల వలన ఉపశమనం లభిస్తుంది.
జీర్ణ వ్యవస్థను బలంగా చేస్తుంది. అంతే కాక కడుపులోని మలినాలను, అంటువ్యాధులను కలిగించే జీవులను తొలగిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి పీచు, కొవ్వు లేకపోవటం, తక్కువ కార్బోహైడ్రేట్ లు కలిగిన జాయకాయ తినటం ఎంతో ఉపయోగకరం.
జామ చర్మపు రంగును మెరుగు పరుస్తుంది. చర్మవ్యాధులు రాకుండా కాపాడుతుంది. దీనికోసం పచ్చి జామకాయలను తింటారు లేక జామపిందెలు, ఆకులు కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని చర్మంపై రుద్దుతారు. పచ్చిపిందెలు, ఆకులు డికాక్షన్‌, పచ్చికాయల రసం, జలుబు నుండి, దగ్గునుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. జామకాయలు క్యాన్సర్‌, గుండెజబ్బులను నిరోధించటంలో బాగా ఉపయోగ పడతాయని పరిశోధనలు గట్టిగా చెబుతున్నాయి.
జామలోని విటమిన్‌ సి, కెరోటినాయిడ్స్‌, ఆఫ్‌ ఎవోనాయిడ్స్‌, పాలీఫెనాల్స్‌ మొదలైన ఫైటో న్యూట్రియంట్స్‌ దీనిని మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా చేశాయి. దానివలన ఈ క్రింది రోగాలతో బాధపడేవారికి స్వాంతన కలగవచ్చు. పంటినొప్పి, రక్తంలో ఆమ్లం ఎక్కువ అవటం, బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధులు, మ్యూకస్‌ పొరవాపు వల్ల వచ్చే రోగాలు, ఊపిరితిత్తుల్లో రక్తం అధికం కావటం, కండరాలు వంకరపోవటం, మూర్చ, అధిక రక్తపోటు, చిగుళ్లవాపు, ఊబకాయం,నోటిలో పుండ్లు, రక్తప్రసరణ సరిగా లేకపోవటం, ఋతుస్రావం ఆగకపోవటం స్కర్వీ మొదగునవి
కొన్ని రోజుల పాటు వరుసగా శుభ్రం చేసిన జామ ఆకులను 5 నిమిషాలపాటు నమలటం వలన నోటి దుర్వాసన, ఇన్‌ఫెక్షన్లు తగ్గి పళ్ళు గట్టిపడతాయని నిపుణుల సూచన.