header

Jeedikayalu/Cashewnut Fruits

జీడికాయలు

ఆంధ్రప్రదేశ్ లో జీడికాయలు పుష్కలంగా లభిస్తున్నప్పటికీ వీటి వాడకం చాలా తక్కువ. కేవలం జీడిపప్పును మాత్రమే సేకరించి జీడిపండ్లను పారవేస్తుంటారు. మార్కెట్ లో అంతగా లభించవు. ప్రఖ్యాతి గాంచి గోవన్ లిక్కర్ మరియు ఫెణిని ఈ పండు ద్వారానే తయారు చేస్తారు. విటమిన్ సి అత్యధికంగా జీడిపండులో ఉంటుంది. కమలాలలో కంటె ఆరు రెట్లు ఎక్కువగా సి విటమిన్ జీడిపండ్లలో ఉంటుంది. చిగుళ్ళకు, పళ్ళకు మంచి చేస్తుంది. జీడిపళ్లు ఎమినో యాసిడ్స్ కు మంచి ఆధారం. శరీరంలోని కొవ్వు వాడకాన్ని మెరుగుపరుస్తుంది. ఫ్యాట్ కరగటాన్ని ఎక్కువ చేస్తుంది. జీడికాయ జ్యూస్ ప్రోబయోటిక్ బ్యాక్టీరియాకు మంచి ఆధారం. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఈ పండు ప్రయోజనాలను గమనించి ఇతరదేశాల వారు జ్యూస్ రూపంలో మనకే అమ్ముతున్నారు. కానీ జీడిపండ్లతో మనమే జ్యూస్ తయారుచేసుకోవచ్చు. ఎక్కడైనా జీడిపండ్లు కనబడితే కూల్ డ్రింక్స్ బదులు వీటిని తప్పకుండా కొనండి. జ్యూస్ చేసుకొని త్రాగవచ్చు లేదా నేరుగా తినవచ్చు. దీనిని గురించి తెలుసుకున్నవారు మీ మిత్రులకు, బంధువులకు, తెలిపి జీడికాయల వాడకాన్ని ప్రోత్సహించండి. తద్వారా మన రైతులకు కూడా లాభం కలుగుతుంది.