రేగుపండు చెర్రీ, బేరి పండ్ల జాతికి చెందినది. ఈ పండు మంచి అరుగుదలకు కారణమయ్యే పీచును కలిగి వుండి జీర్ణవ్యవస్థను మెరుగు పరచటంలో ఎంతో సహాయం చేస్తుంది.
ప్రయోజనాలు : రేగు పండ్లలో అవి పచ్చివి కాని ఎండబెట్టినవి కాని వీటిలో నియోక్లోరోజనిక్, క్లోరోజనిక్ ఆమ్లమనే ప్రత్యేకమైన ఫైటోన్యూట్రియంట్స్ ఉన్నాయి. అవి యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తాయి. ఇవి శరీరానికి ఎంతో లాభం చేకురుస్తాయి
రేగుపండ్లలో యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉండటం వల్ల న్యూరాన్‌కు కొవ్వు, కణం యొక్క పొరలో ఉండే కొవ్వుకు జరిగే హానిని ఆపుతుంది. రేగుపండు తినటం వలన శరీరంలో ఇనుము తయారవ్వటం, శరీరం ఇనుమును పోషించుకోవటం తేలిక అవుతుంది. తద్వారా రక్తప్రసరణ మెరుగై ఆరోగ్యకర కణజాలాలు పెరుగుతాయి. రేగుపండును తరచుగా తినటం వల్ల కంటికి సంబంధిచిన నాళాలు శిథిలమవ్వకుండా కాపాడబడతాయి. అలాగే ఇతర ఇన్‌ఫెక్షన్ల బారినుంచి కాపాడుతుంది. దానివల్ల మన కళ్ళు ఆరోగ్యంగా ఉండి చూపు మెరుగవుతుంది.
రేగుపండులో ఉన్న క్యాన్సర్ నిరోధక పదార్థాలు శరీరంలో పెరిగే క్యాన్సర్, కణుతులను ఆపివేయటంలో సహాయం చేస్తుందని పరిశోదకులు కనుగొన్నారు. రేగుపండులో ఉన్న శుభ్రపరిచే గుణం, రక్తాన్ని శుద్ధిచేసి గుండెకు ఏ విధమయిన ఇబ్బందులు రాకుండా కాపాడుతుంది. రేగుపండులో ఉన్న సి విటమిన్ ఉబ్బసం పెద్దపేగుల క్యాన్సర్, నొప్పులతో కూడిన కీళ్ళవాతం, దీర్ఘకాల కీళ్ళవాతం నుండి శరీరంను రక్షిస్తుంది. రేగుపండు యొక్క చిక్కని రసం మనుషులో వచ్చే ఇన్‌ఫ్లూయంజాను తగ్గించటంలోనూ, రాకుండా ఆపటంలోనూ బాగా పనిచేస్తుంది.