header

Keera

Keera కీర దోసకాయ

కీరా కుకుంబర్ జాతికి చెందినది. ఇందులోని గుండ్రని వాటిని దోసకాలని పిలుస్తాము. మన ప్రాంతాలలో పచ్చగా, పొడవుగా ఉండే కీర దోసకాయలు ఎక్కువగా లభిస్తాయి. వీటిని పచ్చివిగా తినటం మరియు సలాడ్లలోను ఎక్కువగా వాడుతుంటారు.
కీర దోసకాయలోని ప్రత్యేకతలు :
కీరాలో ఉన్న 96 శాతం నీరు శరీరంలోని వ్యర్ధపదార్ధాలను తొలగించేందుకు సాయపడుతుంది. అధిక శాతంలో ఉండే పోటాషియం, మెగ్నీషియం, కొద్దిపాళ్ళలో ఉండే సోడియం అన్నీ కలిపి బి.పిని తగ్గిస్తాయి. లో బీ. పి హై బిపితో బాధపదే వారికి మేలు చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం వేడిచేయడం వలన నోరు దుర్వాసన వస్తుంది. కీరాలోని చలువ గుణం వల్ల నోటి దుర్వాసన పోతుంది. దంతాలూ, చిగుళ్ళ సమస్యలతో బాధపడేవాళ్ళకి కీరాలోని ఖనిజాలు ఎంతో సహాయపడతాయి.
కీరారసంలోని క్షారగుణం శరీరంలోని ఆమ్లగుణాన్ని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. కీరాలు తినడం వలన జీర్ణసమస్యలు, అల్సర్లు మలబద్ధకం తగ్గుతాయి.
కీరా మూత్రపిండాల పనితీరుకి దోహదపడుతుంది. యూరిక్ ఆమ్లాన్ని నియంత్రించే గుణమూ కీరాకు ఎక్కువే. దీంతో మూత్రాశయంలో రాళ్ళు ఏర్పడవు.
కీరాలోని సిలికా కణాల వృద్ధికి తొడ్పడంతో చర్మం కాంతిమంతంగా మృదువుగా ఉంటుంది. కళ్ళకింద ముడుతలను, టానింగ్ ని తొలగిస్తుంది. ఎ.బి. సి. విటమిన్లు పుష్కలంగా ఉండే కీరాలను క్రమం తప్పకుండా తీసుకోవటం వలన చర్మం ఆరోగ్యాంగా మెరుస్తుంది. మొటిమలతో బాధపడేవారు కీరా తినడం వలన చర్మం జిడ్డు కారడం తగ్గుతుంది. సిలికాన్, సల్ఫర్ లు సమృద్ధిగా ఉండే కీరా జుట్టు పెరుగుదలకి తోడ్పడుతుంది.
రోజూ కీరా రసాన్ని తాగడం వలన ఎగ్జిమా, ఆర్తరైటిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. జట్టు ఊడడం కూడా తగ్గుతుంది. కాలేయం, క్లోమ గ్రంధుల పనితీరును మెరుగుపరుస్తుంది. మధుమేహం ఉన్న వారికి మంచివి.
ఇందులోని ఎరెప్సిన్ అనే ఎంజైమ్ ప్రొటీన్ల జీర్ణానికి సాయపడుతుంది. క్యాలరీలు తక్కువ, పీచు ఎక్కువ ఉండే కీరా ఆకలిని తగ్గించడంతో పాటు ఇందులో ఎక్కువగా ఉండే నీరు క్రేవింగ్ని తగ్గిస్తుంది. ఫలితంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి మంచిది.
కీరాలోని లిగ్నన్లు అనే ఫైటో న్యూట్రియంట్లు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇంకా సి విటమిన్ తో సహా ఇందులో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కీరాముక్కలను కాసేపు కళ్ళమీద పెట్టుకుంటే కళ్ళ ఉబ్బుని తగ్గిస్తుంది. కంటి అలసటను తలనొప్పిని నివారిస్తుంది.
ఇందులోని ఫిసిటిన్ అనే ఫ్లేవొనాల్ జ్గ్నాపకశక్తిని పెంపొందింస్తుంది. ఫలితంగా ఇది వృద్దాప్యంలో వచ్చే అల్జీమర్స్ ను నియంత్రిస్తుందని పరిశోధనల్లో తేలింది. కీరాను సూపర్ ఫుడ్ అంటారు.