header

Kharbooja

కర్బూజా

వేసవికాలంలో ఎక్కువగా లభించే కర్బూజా వేసవి తాపాన్ని తగ్గిస్తుంది. మృదువుగా ఆకుపచ్చగా లేదా పసుపు రంగులో ఉండే రెండు రకాల పండ్లు ఎక్కవగా లభ్యమవుతాయి. పండితే గుజ్జు ఆరెంజ్ రంగులోకి మారుతుంది. ఆకలిని పెంచేందుకు, మూత్రాశయంలో ఇన్ ఫెక్షన్లు తగ్గించేందుకు మలబద్ధకాన్ని నివారించేందుకు మంచి మందు. శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. వందగ్రాముల కర్బూజాలో 10 కిలో క్యాలరీలు మాత్రమే ఉంటాయి. రక్తపోటు బాధితులకు అత్యవసరమైన పొటాషియం కర్బూజాలో పుష్కలంగా ఉంటుంది.
కర్బూజా ద్వారా లభ్యమయ్యే ఫోలిక్ ఆమ్లం గర్భస్థ శిశువులకు ఎంతో మంచిది. గర్భణిలు రోజూ కాసిని కర్బూజా ముక్కలు తింటే మంచిది. ఎ.బి,సి విటమన్లు, సోడియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు మెండుగా ఉంటాయి.
ఖర్బూజాలో ఎన్నో పోషకాలుంటాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ప్రయోజనకరమైన అత్యుత్తమ విటమిన్ 'ఎ" ఉంటుంది. ఆహార పదార్థాల జాబితాలోకి ప్రపంచ హెల్త్ ఫౌండేషన్ ఈ పండును చేర్చింది. సిగరెట్ త్రాగటం వలన ఊపిరితిత్తులకు జరిగే హానిని శరీరంలోని విటమిన్ ఎ స్థాయిని ఎదుర్కొంటాయి. దీనిలో లభించే బీటాకెరోటిన్ మాస్కులర్ డీజనరేషన్ అడ్డుకోవటంలో సహకరిస్తుంది. వయసుతో వచ్చే దృష్టిలోపాన్ని నివారించగలడు.
ముఖ్యంగా అత్యంత తక్కువస్థాయి గ్లైసిమిక్స్ ఇండెక్స్ వలన డయాబెటిక్ వారికి ప్రయోజనకర ఆహారం. ఈ పండులో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం కలవారు రోజూ తినవచ్చు