header

Kiwi Fruits….కివి పండ్లు...

Kiwi Fruits….కివి పండ్లు...

కివి సిట్రస్ జాతికి చెందిన పండ్లు. వీటిలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ప్రీ రాడికల్స్ ను నిరోధిస్తుంది. చర్మపు రంగును మార్చటానికి సహాయపడుతుంది. కివీ పండును తాజాగా తినాలి. ఈ పండు గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేయటం వలన మొటిమలు, మచ్చలు, ముఖంలోని రంధ్రాలు తొలగిపోయి ముఖం అందంగా తయారవుతుంది. వీటిని తినటం వలన నిద్రకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.
కివి ఫ్రూట్ న్యూట్రియంట్ లక్షణాలు కలిగిన పండు. ఇవి చైనా దేశానికి చెందినవి. వీటిని ఫ్రూట్ సలాడ్స్ లోనూ, డిజర్ట్స్ లోనూ వాడుతారు. వీటి లోపల భాగం లేత ఆకుపచ్చ రంగులో, సన్నని చిన్న నల్లగింజలతో ఉంటుంది. ఈ పండులో ఉన్న పీచుపదార్ధం వలన కొలస్ట్రాల్ తగ్గుతుంది. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. డయాబెటిక్ పేషంట్లు తినవచ్చు.
పొటాషియం, క్యాల్షియం, మాంగనీస్ ఖనిజాలు, A, B6, B12, E విటమిన్లు ఉన్నాయి. ఈ పండ్లలో అధికంగా ఉన్న పొటాషియం వలన ఇవి తరచుగా తింటుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది