header

Lemon

Lemon / నిమ్మకాయలు

నిమ్మకాయలలో రెండు రకాలుంటాయి. గజనిమ్మకాలు, నిమ్మకాయలు. మామూలుగా నిమ్మకాయలు పండినపుడు గుండ్రంగా పసుపు రంగుతో తోలు పలుచగా ఉంటాయి. గజనిమ్మకాయలు పెద్దవిగా ఉండి తోలు మందంగా కాయలు బుడిప కలిగి ఉంటాయి.
నిమ్మకాయలలో కొవ్వుగానీ, క్యాలరీలు గానీ, సోడియంగాని ఉండవు. విటమిన్ సి, పోటాషియం, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. సి విటమిన్ చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది క్యాన్సర్ పై పోరాడుతుంది. వృద్ధాప్యాయాన్ని దూరం చేస్తుంది. నిమ్మకాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శ్యాస ద్వారా సంక్రమించే అంటురోగాలను నిరోధిస్తాయి.
నిమ్మలోని శాపోనిన్ జలుబును ఫ్లూ జ్వరాన్ని దూరంగా ఉంచుతాయి. మన శరీరం ఇనుమును బాగా శోషణం చేసేందుకు నిమ్మ చాలా మంచి ఉపయోగకారి.
ఉదయాన్నే వేడి కాఫీ, టీలు తాగే బదులు వేడిగా నిమ్మకాయ నీళ్ళు తాగితే మీ జీర్ణశక్తి బాగా పని చేస్తుంది. అరచెక్క నిమ్మకాయ రసాన్ని పెద్ద గ్లాసు నీళ్ళలో లేక రుచికి తగినట్లు కలుపుకుని తాగవచ్చు. దీనివల్ల కడుపులోని హైడ్రో క్లోరిక్ ఆమ్లం బలపడి అరుగుదల మెరుగుపడుతుంది. నిమ్మకాయల వాడకం వలన స్కర్వీ వ్యాధి రాకుండా ఉంటుంది. గాయాలను నయం చేస్తుంది. చిగుళ్ళనుంచి రక్తం కారడం తగ్గుతుంది. ఎముకలు ధృఢంగా మారతాయి.
ఉప్పుకు బదులుగా వంటలలో రుచికోసం నిమ్మరసం వాడవచ్చు. పండిన టమాటోలు, ఉల్లిపాయలు, పచ్చమిర్చి, కొత్తిమీర సన్నగా తరిగి వాటిలో నిమ్మరసాన్ని పిండితే నోరూరించే సలాడ్ తయారవుతుంది. సముద్రపు చేపలు, చికెన్, మటన్ కూరలపై నిమ్మరసం చల్లుకుంటే వాటి రుచే వేరు.
నిమ్మకాయల నుండి ఎక్కువ రసం కావాలంటే వాటిని బాగా నలపాలి. లేదా వేడి నీళ్ళలో కాసేపు ఉంచండి.